AP 39TV 04మే 2021:
గుడిబండ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పెనుకొండ సబ్ కలెక్టర్ టి నిషాంతి ఆదేశాల మేరకు గుడిబండ , చిగతుర్పి ,K N పల్లి , జమ్ములబండ ,కరేకెర అంగడి మరియు ఇతర షాపులను గుడిబండ తహసిల్దార్ మహబూబ్ ఫిరా ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి తనిఖీ చేశారు. covid 19 ప్రోటోకాల్ ప్రకారం మీ షాపులు ముందు మాస్కులు, షానిటైజర్లు తూచ తప్పకుండా పాటించవలెను అని హెచ్చరించారు. ఒక వేళ ప్రోటోకాల్ అతిక్రమిస్తే తప్పనిసరిగా జరినామలు వేయడం జరుగుతుంది. ఇప్పటికే కొంత మందికి జరిమానాలు విధించినట్లు తహసిల్దార్ మహబూబ్ ఫీరా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సహాయకులు కానిస్టేబుల్ లక్ష్మి కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.