AP 39TV 01ఏప్రిల్ 2021:
ప్రజలకే కష్టం వచ్చినా వారికి అందుబాటులో ఉండి వారికే సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరించే కార్యాలయాలు గ్రామ సచివాలయాలు.
గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసేవకు సరికొత్త నిర్వచనంగా మారిన సచివాలయాలు గురువారంనాడు శింగనమల నియోజకవర్గంలో గార్లదిన్నె మండలంలోని పలు గ్రామాల్లో ఒకేరోజు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుంచి పరిపాలన ప్రజల ముంగిటకు వచ్చేసింది. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పాత రోజులకు చరమగీతం పాడినట్టే అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా గ్రామ సచివాలయ తలుపు తడితే చాలు సమస్య పరిష్కారమైపోతుంది అని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగిన నూతన గ్రామసచివాలయాల వివరాలు ఇలా ఉన్నాయి.
1. గార్లదిన్నె మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం
2. మర్తాడు గ్రామంలో గ్రామ సచివాలయం
3. కొప్పలకొండ గ్రామంలో సచివాలయం
4. ఇల్లూరు గ్రామంలో సచివాలయం
5. కనంపల్లి గ్రామ సచివాలయాలకు ప్రారంభోత్సవాలు జరిగాయి.
ముఖ్యనాయకులు అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.