Header Top logo

The men of this age ఈ కాలపు మనుషులు

The men of this age

“ఈ కాలపు మనుషులు”

ఈ కాలపు మనుషులలో
ఓ కొత్తచూపు మొలకెత్తింది
క్రొంగొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి
విశ్వాసాన్ని వదలి…
ఆశల ఆసరా లేకుండా..
వ్యసనాల అడుగులు తొక్కకుండా…
స్వార్థపు బాటలో నడవకుండా…
ఉండలేకపోతున్నారు…
అన్నీఇష్టంగా కష్టం తెలవకుండా
సృష్టించుకుంటున్నారు!!…

మబ్బుల మాటున వారి చూపులవాటు
నిత్యం పరుగు పందెమే!!….
ప్రతినిత్యం ఓ విచిత్రమే!!…
ప్రతికృత్యం సంతోషపు విలాసమే!!…
విజయం అందుకోవాలని…
దొరికినంతా దోచుకోవాలని…
అందినంతా అందుకోవాలని…
యమయాతన పడుతున్నారు…
రణానికైనా…మరణానికైనా సిద్ధమవుతున్నారు…
ఆశల కాగడాను పట్టుకొని
స్వార్థపులోగిళ్ళల్లో సాగుతున్నారు…

ఆకాశం కనికరించి
కన్నీళ్లయినా రాల్పుతుంది…
కానీ ఈనాటి మనుషుల్లో
కఠినహృదయం కదలనంటుంది…
కనికరంలేకుండా కఠినంగా ఉంటుంది..
కరుణ..ఆర్ద్రత అసలే ఉండదు…

ఒకరిని కష్టపెట్టి బతికేతత్వం…
వారిది కష్టపడే మనస్తత్వత్వం కాదు..
చుట్టూ అల్లుకున్న స్వార్థపువలల్లో కదలిపోతుంటారు…
నిత్యం ఎవరిని బుట్టలో వేసుకోవాలి అంటూ అన్వేషిస్తూ ప్రయత్నం చేస్తుంటారు…
తళుక్కున మెరిసే మనసులోతుల్లో
అలజడి పుట్టించేస్తుంటారు…
గుండెపొరల్లోఆశలసవ్వడితో
ఆలోచనల ఒరవడిని కొనసాగిస్తుంటారు…

సమయం దొరికితే
అలుపెరుగని ఆరాటం వారిది…
క్షణక్షణం ఓ ఉద్రేకంతో
శాయశక్తుల పోరాటం చేస్తుంటారు…
అదే వారి వ్యసనాల ప్రస్థానం…
కష్టపడటం మరిచిపోయారు..
అన్నీ ఇష్టంగా రావాలంటారు…
ఇష్టంగా దోచుకోవాలనుకుంటారు..
మాటిమాటికీ.. పూటపూటకీ
మర్మంతో పీడిస్తూ ఉంటారు…

మనిషి మనుసు ఓ వాల్మీకమే
ఎన్నెన్నో రహస్యపు ద్వారాలు…
అంచనాలకు మించిన ఆకాంక్షలు..
అసత్యాల మాటలతో
అంతరంగాన్ని పిండేస్తారు…
వీరు ఓ ప్రత్యేక భూమికతో
గురితప్పని బాణాన్నివేస్తారు…
అల్పక్షణాలలో అనల్పకాలాన్ని సృష్టిస్తుంటారు…

ఒక పోరాటపటిమతో…
యుద్ధభేరిని మోగించి…
సులువైనదారిని తమకు
అనుకూలంగా మలుచుకొని
స్వార్థపు మీటను నొక్కుతారు…
గురితప్పకుండా గుండు
దూసుకుపోతుంది…
అనుకున్నది వారికి దొరుకుతుంది…
వారి తలపంతా స్వార్థపువలపే!!

ఒక పోరాటపటిమతో... యుద్ధభేరిని మోగించి... సులువైనదారిని తమకు అనుకూలంగా మలుచుకొని స్వార్థపు మీటను నొక్కుతారు... గురితప్పకుండా గుండు దూసుకుపోతుంది...

అంబటి నారాయణ

నిర్మల్,  9849326801

Leave A Reply

Your email address will not be published.

Breaking