Header Top logo

కమ్యూనిస్టుల జీవితాలు త్యాగ భరితం

ఒకప్పుడు కమ్యూనిష్టుల త్యాగాలు గొప్పయి..

మారుతున్న కాలంతో పాటు మన దేశంలో వారు మారుతున్నారెమో అనిపిస్తోంది. బీజేపీ మతం బూచిని చూపి బీఆర్ ఎస్ కు కమ్యూనిష్టులు ఎన్నికలలో మద్దతు ఇవ్వడం ఇందుకు తాజా ఉదాహరణ. పుచ్చల పల్లి సుందరయ్య లాంటి కమ్యూనిష్టు యోధులు ఇప్పుడు కనిపించడం లేరు.

నాస్తీకులం అంటునే వారు దేవాలయాల చుట్టు ప్రదక్షణాలు చేయడం ఇలా ఎన్నో చెప్పొచ్చు. నక్సల్స్ మాత్రం విప్లవం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. వారు కూడా మారుతున్న కాలంతో పాటు మారడం లేదనేది నా అభిప్రాయం. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో విప్లవం సాధ్యం కాదెమో.. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేనప్పుడు, విలువైన ప్రాణాలను త్యాగం చేయకుండా  మరో మార్గం చూసుకోవాల్సి ఉంది.

– యాటకర్ల మల్లేష్

కమ్యూనిస్టుల జీవితాలు త్యాగ భరితం

1941లో రెండో ప్రపంచ యుధ్ధం మొదలైంది

ఈ ఫొటోలో ఉంది
జుకాష్ విలీ (స్టాలిన్ )
స్టాలిన్ పక్కన ఉన్నది
ఆయన కొడుకు లెఫ్టినెంట్
యాకోబ్ జుకాష్ విలీ!

యాకోబ్ ఇతర రెడార్మీ
సైనికులతో బాటు నాజీల
కు ఖైదీగా దొరికాడు!

యాకోబ్ నాజీల ఖైదీల
జైలులో నిర్భంధం లో
ఉన్నాడు!

కొద్ది కాలం తరువాత
నాజీల అత్యున్నత సైనికా
ధికారి మార్షల్ ఫెడరిక్ పాలస్ రెడార్మీకి ఖైదీగా
దొరికాడు!

తమ అత్యున్నత సైనికాధికారీ,
యుధ్ధవ్యూహ నిపుణుడూ అయిన పాలస్ ను విడిపించుకోడానికి నాజీలు బేరం పెట్టేరు!
మీరు మా పాలస్ ను విడిచి పెడితే మేము
యాకోబ్ ను విడుదల చేస్తామని ప్రతిపాదించారు!

అందుకు స్టాలిన్ ఏమన్నాడంటె ..
నాకొడుకు తన తోటి రెడార్మీసైనికులతో
విడుదలౌతాడు !

అంతెగానీ ఓ లెఫ్టినెంటు
ఓ మార్షల్ కు సమానం కాడు,

పాలస్ ను విడుదల
చేసి నా రెడార్మీ నా సోవియట్ ప్రజలను నరకం లోకి తోయలేను!
అని ఖైదీల మార్పిడీకి అంగీకరించలేదు!

దీనితో 14-04-1943
న యుధ్ధఖైదీ స్టాలిన్ కుమారుడు యాకోబ్ ను
నాజీలు కాల్చిచంపేరు!

దేశరక్షణకోసం స్టాలిన్
తన ప్రేమాస్పదుడైన కొడుకును త్యాగంచేశాడు!

కమ్యునీస్టుల జీవితాలు
త్యాగభరితంగా ఉంటాయి

– వాట్సాప్మంచి పుస్తకం గ్రూప్ నుంచి..

సేకరణ : పద్మ, న్యాయవాది

 

Leave A Reply

Your email address will not be published.

Breaking