The communists are the guts కమ్యూనిష్టోళ్లు గట్లనే ఉంటారు
The communists are the guts
కమ్యూనిష్టోళ్లు గట్లనే ఉంటారు
కేరళ సి.ఎం. ఏం చేశారో తెలుసా…?
గీయన హోటల్లో కూర్చుండి అన్నం తింటుంది ఎవరో ఎరుక పట్టిండ్రా..? గాయన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్. మరీ గా సీఎం గిట్ల హోటల్ లో కూర్చుండి అన్నం తినుడేందని అనుకుంటుండ్రా.. గా రాష్ట్రంలో ఉంది కమ్యూనిష్టు పార్టీ ప్రభుత్వం. అయితే ఏందట అని అనుకుంటుండ్రా.. అది అంతే కమ్యూనిష్టులకు ఎంత పెద్ద పదవులొచ్చినా పెద్దగా పట్టించుకోరు. కామన్ మెన్ లా బతుకుతారు.
మా ఊళ్లో సర్పంచ్..
గట్లెట్లా మా ఊళ్లే సర్పంచ్ కాంగానే పెద్ద కారు, ఇంటి ముందు పనోళ్లు, ఇగ అదో హంగామా చేత్తారంటుండ్ర. గీ కమ్యూనిష్టులొల్లు గిట్లనే. మన దగ్గరైతే కమ్యూనిష్టులొల్లు కొట్లాటకు ముందుంటారు. ఓట్లకాడి కత్తే వెనుక పడి పోతారు. అది గాళ్ల తప్పు కాదు. పబ్లిక్ తీరే అంతా. ఇప్పుడు గీ సోషల్ మీడియా డామినెట్ చేస్తున్నప్పటి నుంచి మత్తు మారి పోయిందనుకో. చెప్పలేనన్ని గ్రూప్ లతో ఎవరికి వారే కమ్యూనిష్టు పార్టీ పేరుతోని పని చేస్తున్న వాళ్లను పబ్లికైతే పట్టించుకున్న దాఖలాలు లేవు. అగో గట్లెట్లంటావ్ అంటారా.. ఎలక్షన్ లో పోటీ చేసినోళ్లు ఓళ్లన్న గెలుస్తారా..? సరే గీ ముచ్చట పక్కకు పెడితే..
నువ్వు బతుకలేవురా..
ఇప్పటి పిల్లలను ‘‘నువ్వు బతుకలేవురా..’’ అంటూ తల్లిదండ్రులే అంటారు. కానీ కమ్యూనిజం గురించి తెలుసుకుంటే వాళ్లు ఏదో ఒక్కటి పని చేసి బతుకుతారు. మీకు తెలుసా..? గీ కేసీఆర్ పెట్టిన టీఆర్ ఎస్ పార్టీలో మత్తుమంది కమ్యూనిష్టులున్నారు. కాక పోతే వాళ్లంతా ఎర్ర జెండాను భుజం మీది కెళ్లి తీసేసి టీఆర్ ఎస్ జెండా కప్పుకున్నరు.
గుమ్మడి నర్సయ్య కూడా..
గీ ఫొటోల కనిపిత్తున్న అతని పేరే గుమ్మడి నర్సయ్య. గీయన జిందగీ గురించి తెలుసుకుంటే.. అగో గిప్పట్ల గిట్లాంటోళ్లు ఉంటారా.. అని మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. గీ గుమ్మడి నర్సయ్య సిపిఐ (ఎం.ఎల్)న్యూడెమోక్రసీ పార్టీ నాయకుడు. ప్రజల కోసం పని చేస్తే అతనిని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు పబ్లిక్. ఎమ్మెల్యేగా ఎక్కడ గెలిసిండానే గదా మీ ఆలోచన. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజక వర్గం నుంచి 1983 నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిండంటే మాటలా.. కానీ ఎమ్మెల్యేగా అన్ని సార్లు గెలిసిన ఇప్పటికి సింపుల్ గా బతుకుతాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లోని విద్యనగర్ పార్టీ ఆఫీస్ నుంచి ఆటోలో అసెంబ్లీకి పోయేటోడు. కమ్యూనిష్టోళ్లంటే గట్లుంటారు. హైదరాబాద్ రావాలంటే ఆర్టీసి బస్సులోనే అత్తాడు. ఊళ్లేనైతే సైకిలెక్కి తిరుగుతాడు. మీకో విషయం తెలుసా.. హైదరాబాద్ లో ఐదు రూపాయలకు అన్నం పెడుతారు గదా.. అగో గా ఐదు రూపాయల అన్నం తింటాడు మరీ..