Header Top logo

Closing charms-11 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-11

Closing charms-11
పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-11

“ఏంది ? ఇంట్ల గివి పెట్టుకుంటరా? పాలొచ్చేటివి, ముండ్లున్న చెట్లు పెట్టుకోవద్దు. అంతా ‘తశిలి’ తగులుతది” ఇట్ల సాగుతది, ఇంటికొచ్చినోల్ల ముచ్చట. ఇంకా ఊరు కుంటరా ”అయ్యో పొయ్యి గక్కడ పెట్టిండ్రు? వాస్తుకు ఆగ్నేయం మూలకు, తూర్పు దిక్కు పెట్టాలే గాని, దక్షిణం దిక్కు వంట చేస్తున్నోల్లని మిమ్మల్నే సూస్తున్నం. తిన్న తిండి పెయ్యికి పడ్తదా బిడ్డా? ” అని సుతిమెత్తగ కొందరు అంటరు. అట్లనే ” బరువంత, ఈశాన్యం మీదేసిన వేంది’’ అని ఇంకొందరంటారు. ఇట్ల సాగుతవి మంది మాటలు.

Closing charms-11 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-11

ఉచిత సలహాలు ఇచ్చి పోతరు

ఇంటికి వచ్చినోల్లు వచ్చినట్లు పోక, ఉచిత సలహాలు ఇచ్చి పోతరు. అక్కడి నుంచి తయారైతది మా ఇంట్ల ఫైర్. ఇక ఊరుకుంటదా మా కృష్ణవేణి, నా మీద పడ్తది. “అంత మంది చెప్తున్న, నీకు ఎక్కదు. ఎట్లేక్కుతదో పో. వాళ్లు మన మంచికే చెప్తున్నరు కదా వినరాదు”అంటుంది. నేను చేసేదేమి లేక, ఇని ఇననట్లుంట. ఉన్నంతలో పరిస్ధితులకు తగ్గట్టుగా ఉండాలే అని, కిటికి దగ్గర ‘పొయ్యిని ‘ పెట్టిన. పొగ బయటకు పోవాలె వెలుగు లోపలికి రావాలె కద!?

మెుక్కల సంగతి చెప్త

ఇక మెుక్కల సంగతి చెప్త. మా ఇంట్లో నిమ్మ, రేగు చెట్లు ఉన్నాయి. దాని మానాన అవి పడి మెులిచినయి. అవి కొన్ని పండ్లనిస్తున్నాయి. అట్లనే కోతుల రాకకు అడ్డం పడ్తవి అని వాటిని అట్లనే ఉంచిన. పొప్పెడు పండు, జిల్లేడు లాంటి పాలు కారే మెుక్కలు, మునక్కాయ, అరటి చెట్లు, పెద్ద మెుక్కలు మర్రి, రాగి, మేడి, వేప లాంటి మస్తు చెట్లు టబ్బులల్ల పెంచుతున్న. అవ్వి పండ్లనిస్తున్నయి. జిల్లేడు లాంటి మెుక్కలు మెుకాల్ల నొప్పులున్నోల్లు పెట్టుకుంటరు. మునక్కాయలతో పాటు ఆకులను కశాయానికి కూరకు తీస్కపోతరు. కంపౌండ్ వాల్ కోసం వెదురు పెట్టిన. ఇట్ల అందరికి ఉపయోగ పడేవి మన దగ్గర ఉండాలని. ఎందుకంటే వాల్ల ఇండ్లల్ల పాలు కారేవి పెట్టరు. ముండ్ల చెట్లు, ఏర్లు ఎక్కువొచ్చేవి పెట్టరు కదా. అందుకే మనం పెంచాలనుకున్న. అంతే.

Closing charms-11 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-11

భగత్ సింగ్ కావాలని పోస్టులు పెడ్తం

ప్రజల కోసం పని చేసిన వాల్లు చనిపోయినప్పుడు ఏప్పుడు ఇనపడే ఒక మాట. ఇలాంటి నాయకులు మల్లి పుట్టాలే. భగత్ సింగ్ లాంటి నవ యువకులు రావాలే. కాని మా ఇంట్ల పుట్టొద్దు. మా పిల్లలు మంచిగ సదువుకొని విదేశాల్లో ఉండాలే. మేం మాత్రం ఇక్కడ సోషల్ మీడియా ముందుంటం. మంది పిల్లలు భగత్ సింగ్ కావాలని పోస్టులు పెడ్తం అనేటోల్ల సంగతి యాది కొచ్చింది. నేను కూడా సోషల్ మీడియా వీరున్నే కదా. భగత్ సింగ్ మందింట్ల పుట్టాలే అనే బాపతే. ఇంకా మారాలే. మా పిల్లలు అట్లా తయారు కావాలనుకుంటున్న. ఆ టైం కోసం సూస్తున్న.

మిద్దె తోట కల్చర్ వ్యాప్తి కోసం

మరి నేను ఏమన్న చేయాలనుకొన్న. ఆ ప్రయత్నంలో భాగంగా అందుకే మా ఇంట్ల ఎవ్వరు వొల్లని వాటిని పెంచుకుంటున్న. నిజానికి మిద్దె తోట కల్చర్ వ్యాప్తి కోసం ప్రభుత్వాలు సహకరిస్తే ఇంటికి, వంటకు ఉపయోగ పడే చాలా చెట్లు పెంచుకుంటం. ఇప్పటికే మిద్దెల మీద, పెరటి తోటలలో పాలు కారే, ముండ్ల చెట్లు కూడా పెంచుకుంటున్నారు. మేము కూడా ఎక్కవగా కంప చెట్లు, పాలు కారేవి, ఇంట్లో ఉంటే ‘తాసిలి’ అనే చెట్లని, కలెక్ట్ చేసి పెట్టుకుంటున్న. Closing charms-11

మా ఊరి పంతులు ముచ్చట

ఇగ మా ఊరి పంతులు ముచ్చట చెప్పి ముగిస్త. 23 ఏండ్ల కింద మా ఊరు అంకుషాపూర్ లో ఐదారు టెలిపోన్ కనెక్షన్లు ఉండేవి. మా ఊరి పంతులుకు పట్నంలో ఉన్న ఆయన పిల్లలు ఫోన్ వస్తే మా ఇంటికి ఒచ్చెటోడు. పోన్ మాట్లాడి ఊక పోతడా పోడు. ‘‘ఏంటి సత్తమ్మ.. మెట్లు ఈశాన్యం దిక్కు బుద్దున్నోడు పెట్టుకుంటడా..? ఇది సాలదన్నట్లు, తూర్పు దిక్కు మెట్ల కింద బాత్ రూం కడ్తరా.. ఇట్లనే ఉంచితే, మీ ఇంట్ల బర్కతుండదు, జరగరానిది జరుగుతది జాగ్రత్త సుమి’’ అని చెప్పెటోడు. కొన్ని ఏండ్లు గడిసినయి.

ఇల్లు వాస్తుకు చేస్తే ముగ్గురు చని పోయిండ్రు

నాలుగు రూముల ఇల్లు పంచుకుంటే, మనిషికి ఒక్క రూం వచ్చింది. మేం ముగ్గురం అన్నదమ్ములం కలిసి, మా తమ్ముడు నర్సింగ్ రావుకు అమ్మినం. ఆ తర్వాతనే మెట్లు కూలగొట్టినం. పంతులు చెప్పినట్లు వాస్తు ప్రకారం మెట్లు, సంపు, బాత్రూమ్ కట్టించింది మా అమ్మ. అంతా మంచి జరుగుతదని అనుకుంది. కాని ఆ తర్వాతనే మా అన్న రమేష్, తమ్ముడు నర్సిగ్ రావ్, అమ్మ సత్తమ్మ ముగ్గురు చనిపోయ్యారు. ఏం చేస్తం మరి? గట్లుంటది మంది వాస్తు చెప్పుడు! Closing charms-11

Closing charms-11 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-11

పిట్టల శ్రీశైలం
మూసి టివి, మూసి ఫైబర్ టబ్స్
995 999 6597

Leave A Reply

Your email address will not be published.

Breaking