Header Top logo

రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 31
గుడిబండ:- ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థను G.O.M.S.No-2 మేరకు గ్రామ రెవెన్యూ అధికారులకు DDO హోదా ఇవ్వడాన్ని గుడిబండ మండల గ్రామ రెవెన్యూ అధికారులు స్వాగతిస్తూ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద్భంగా గుడిబండ మండల గ్రామ రెవెన్యూ అధికారులు యూనియన్ ప్రెసిడెంట్ E.C. వలి గారు మాట్లాడుతూ ప్రభుత్వం మా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా విధులు సక్రమంగా నిర్వర్తిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుడిబండ మండలం లో వీఆర్వోలు యూనియన్ అధ్యక్షులు ఈ.సి వలి మరియు వీఆర్వోలు దీపారాణి నాగరాజు రామప్ప విఆర్ఏ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking