Header Top logo

The Brahmotsavas of Srinivasan begin without devotees

భక్తులు లేకుండానే తిరుపతి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన ప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ స్మరణ, మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు.. పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.  అయితే గత ఏడాది లాగే  ఈ సంవత్సరం కూడా  బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించ బోతున్నారు.

తిరుమల చరిత్రలో,  వందల ఏళ్ళ నుంచీ  వివిధ ఉత్సవాల నిర్వహణ జరుగుతున్నది. ఎందరో రాజులు, ఆర్కాటు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్‌ అధికారులు,   తర్వాత హథీరాం మహంతుల హయాంలో  ఉత్సవాలు కొనసాగాయి. ఒకప్పుడు నెలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిగేవట. కొన్ని ఇబ్బందులు, సమస్యల కారణంగా ఏడాదికి ఒకసారి, అధిక మాసంలో రెండుసార్లకు బ్రహ్మోత్సవాలు పరిమితం అయ్యాయి. ఈ వేడుకల్లో శ్రీ వేంకట్వేరుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు.

ఎలాంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలనుThirupathi temple రద్దు చేయడం కానీ, ఏకాంతంగా నిర్వహించడం కానీ తిరుమల క్షేత్ర చరిత్రలో లేదు. కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో  ఏడాది వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాంప్రదాయ రీతిలో కన్నుల పండువగా కొనసాగ నున్నాయి. భాద్రపదంలో నిర్వహించే ఉత్సవాలను సాలకట్ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈ నెల 7 నుంచి 15 వరకు నిర్వహించ నున్నారు.

రెండు మూడు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ ఉండొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో  గత సంవత్సరం మాదిరిగానే  ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించా

రు.  బ్రహ్మోత్సహాలను ఏకాంతంగా నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం, అక్టోబ‌రు 11న గ‌రుడ‌ వాహ‌న‌ సేవ‌, అక్టోబ‌రు 12న స్వ‌ర్ణ‌ ర‌థం (స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 14న ర‌థోత్స‌వం (స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 15న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగుతాయి. ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.  బ్రహ్మోత్సవాలను ప్రతి సంthirupathi purohithuluవత్సరం అంగరంగ వైభవంగా, లక్షలాది మంది భక్తుల మధ్య నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా, గత సంవత్సరం లాగే ఈ సారి కూడా   భక్తుల భాగస్వామ్యం లేకుండానే  ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా, మార్గదర్శకాలకు పాటిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలలో తొలి రోజు పెద్దశేష వాహనం నుంచి చివరి రోజు అశ్వ వాహనం వరకు అన్ని వాహన సేవలనూ కల్యాణ వేదికలోనే కొనసాగిస్తారు. ఉత్సవ మూర్తులకు అలంకరణ, సల్లింపు, శాత్తుమెర, స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలు రంగనాయక మండపంలో జరుగ నున్నాయి.  చిన్నశేష వాహనం, హంస వాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం,  హనుమంత వాహనం, గజ వాహనం,  సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వ వాహనంపై స్వామి ఉరేగ నున్నారు.

ఏ రోజు వాహనాన్ని ఆ రోజు కల్యాణ వేదికలో సిద్ధంగా ఉంచుతారు. విశేష అలంకరణలో ఉత్సవ మూర్తులను తిరుచ్చిపై మంగళ వాయిద్యాలతో పక్కనే ఉన్న కల్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, వాహనంపై కొలువు తీర్చుతారు. అక్కడ దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, హారతి, నైవేద్య సమర్పణ చేస్తారు. అనంతరం జీయర్‌ బృందం శాత్తుమొర నిర్వహిస్తుంది. ఆ తర్వాత మరోసారి హారతి సమర్పించి ఉత్సవ మూర్తులు తిరిగి రంగనాయక మండపానికి వేంచేపు చేస్తారు. ఈ విధంగా ఆలయం నుంచి వాహనాన్ని వెలుపలకు తీసుకు రాకుండా, భక్తులెవరినీ అనుమతించ కుండా పూజలను, ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏకాంత కార్యక్రమాల్లో అర్చకులు, జీయర్‌ స్వాములు, అధికారులు సైతం పరిమిత సంఖ్యలో పాల్గొంటారు.ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ధర్మకర్తలు, అధికారుల పర్యవేక్షణలో విశేష కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం  సాయంత్రం 6 గంట‌ల‌కు ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణతో ప్రాంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీతో ముగియ నున్నాయి.

బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు…

06.10.2021 – బుధ‌వారం – అంకురార్ప‌ణ – సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు;  07.10.2021 – గురువారం – ధ్వ‌జారోహ‌ణం (మీన‌ల‌గ్నం) – సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల వ‌ర‌కు; 08.10.2021 – శుక్ర‌వారం – చిన్న‌శేష వాహ‌నం -ఉద‌యం 9 నుంచి 10వ‌ర‌కు.. హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు; 09.10.2021 – శ‌నివారం – సింహ వాహ‌నం -ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్న‌ప‌న‌ తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3గంటల వ‌ర‌కు.. ముత్యపు పందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు; 10.10.2021 – ఆదివారం – క‌ల్ప‌ వృక్ష వాహ‌నం – ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు… స్న‌ప‌న‌ తిరు మంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు; 11.10.2021 – సోమ‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు..గ‌రుడ‌ సేవ‌ – రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు; 12.10.2021 – మంగ‌ళ‌ వారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్వ‌ర్ణ‌ ర‌థం బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.. గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు; 13.10.2021 – బుధ‌వారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల‌కు వ‌ర‌కు..స్న‌ప‌న తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వ‌ర‌కు.. చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు; 14.10.2021 – గురువారం – ర‌థోత్స‌వానికి బ‌దులుగా స‌ర్వ‌ భూపాల వాహ‌నం- ఉద‌యం 7.35 గంట‌ల‌కు… అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు; 15.10.2021 – శుక్ర‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు,  స్న‌ప‌న‌ తిరు మంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు (అయిన మ‌హ‌ల్‌లో).. ధ్వ‌జావ‌రోహ‌ణం – రాత్రి 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ నున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంthirupathi templeధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించ నున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరంను ప్రారంభించ నున్నారు. పాత బర్డ్‌ హాస్పిటల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించ నున్నారు. అలానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించ నున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించ నున్నారు.

ఇటీవలే రోజువారీ ఉచిత దర్శన టోకెన్ల సంఖ్యను 8వేలకు పెంచింది టీటీడీ. ప్రస్తుతం రోజుకు దాదాపు 30వేల మంది శ్రీవారిని దర్శించు కుంటున్నారు. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక బడిన వర్గాల భక్తులకు ఈనెల 7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇలా దర్శనం చేసుకునే శ్రీవారి భక్తులకు ఉచిత రవాణా, భోజన, వసతి సౌకర్యాలను టీటీడీ అధికారులు కల్పించనున్నారు. వెంకన్న దర్శనంతో పాటూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేయిస్తారు. భక్తులను ఉచితంగా తీసుకు వెళ్లి,  దర్శనాలు చేయించేందుకు ఒక్కో జిల్లాకు 10 బస్సులు ఏర్పాటు చేశారు.

తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు అందుబాటులో ఉంచారు. ఒక్కో బ‌స్సులో ఇద్ద‌రు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజనాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంకురార్పణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు,  ధ్వజ అవరోహణతో ముగుస్తాయి. కొవిడ్ వ్యాప్తి నివారణ దృష్ట్యా దర్శనం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దర్శనం టోకెన్ ఉంటేనే కొండపైకి అనుమతిస్తోంది.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత  సెల్:   9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking