With Prakash Raj contesting in “our” election
With Prakash Raj contesting in “our” election The hegemonic adiripadutandru …!
“మా” ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ తో
ఆధిపత్యవాదులు అదిరిపడుతండ్రు…!
ప్రకాష్ రాజ్ ను ఎదుర్కొలేని వారు స్థానిక, స్థానికేతర నినాదాన్ని ముందు తెచ్చారు. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ,ఆంధ్ర నిదానం వస్తే అప్పుడు ఈ బాబులకు వారి బాబులకు లాగుతడిసిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏమిటో ఆలోచించండి..!! కేవలం తొమ్మిది వందలు, వెయ్యి ఓట్లున్న “మా “అసోసియేషన్ ఎన్నికల్లో జాతి గర్వించే అద్భుతమైన క్యారెక్టర్ నటుడు సామాజిక ఉద్యమకారులు, జాతీయ ఉత్తమ నటులు ప్రకాష్ రాజ్ గారు అద్యక్షులుగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇంతకాలం ఏకచత్రాధిపత్యాన్ని చెలాయించిన ఆధిపత్యవాదులు అదిరిపడుతండ్రు.
★ దశాబ్దాలుగా తెలుగు నేలపై సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న బాబుల కులం ముఖ్యంగా కమ్మ కులం ఆధిపత్యాన్ని చిరంజీవి రాకతో ఆ ఏక కులం ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి విషయం తెల్సిందే. ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వర రావు,కృష్ణ, శోధన్ బాబు,మోహన్ బాబు వరకు హీరో, హీరోయిన్ లంతా కమ్మాధిపత్య కులాలకుచెందిన వారే. అందులోనూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆధిపత్య కులాలు. ఒక్క ప్రభాకర్ రెడ్డి తప్ప ప్రధానమైన విలన్ లు కూడా ఆధిపత్య కులాల వారే.ఈ మధ్యకాలంలో తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజిరెడ్డి (దిల్ రాజు) ఆయన సమీప బంధువు నితిన్ రెడ్డి ఆయన తండ్రి సినిమా నిర్మాత పంపిణీ దారుగా ఎదిగొచ్చిన విషయం తెల్సిందే. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి అనేకమంది సినిమాలు తీసినా నష్టపోయిన విషయం తెల్సిందే. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా కూడా ఎదగడానికి అవకాశాలు కూడా దక్కలేదు.
————————————————-
★ తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత కూడా సినిమా ఇండస్ట్రీలో
సీమాంధ్రకు చెందిన ఆధిపత్య కులాలదే ఆధిపత్యం…!
—————————————————
★ ఒక బహుజనుడు ప్రకాష్ రాజ్ ఆధిపత్య దోపిడి కులాలు నిర్మించుకున్న కోటగోడలపై బహుజన జెండా ఎగురవేస్తారనే భయం పట్టుకుందికమ్మాధిపత్య సినిమా పెట్టుబడిదార్లకు. అందుకే ఆయనను ఎదుర్కొలేని ఆధిపత్యవాదులు స్థానిక, స్థానికేతర నినాదం ముందుకు తెచ్చారు. అలా అయితే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఆంధ్ర,తెలంగాణ నిదానం ముందుకొస్తుంది.అప్పుడు ఈ బాబులంతా విశాఖపట్నం బీచ్ లో లంగోటిలు, పల్పిబటానిలు అమ్ముకోవాలి.
★ సినిమా, టివి ఇండస్ట్రీలోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన బహుజన కళాకారులంతా సామాజిక మార్పుకోసం తపించే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని “మా” ఎన్నికల్లో అత్యదిక మెజారిటీతో గెల్పించడానికి శ్రమించాలసి అవసరం ఎంతైనా ఉంది.
————————————-
“మా” ఎన్నికల్లో స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది..!
————————————-
బాబులంతా ఒక వైపు బాబేయేతరులంతా ఒక నిలబడి “మా” ఎన్నికల్లో రాజకీయ యుద్ధం చేస్తున్నారు. సినిమా రంగం ద్వారా సమసమాజ కోసంసాంస్కృతిక సామాజిక పోరాటం చేసిన సినిమా నటుడు, సిపిఐ నాయుడు మాదల రంగారావు కొడుకు మాదల రవి కూడా బాబుల పక్కనే నిలబడ్డాడు. అంటే కాల పరిక్షలో ఎవరు ఎటువైపో తేలిపోతుందని మాదల రవి వైఖరితో రేపటి చరిత్రకు సాక్షిగా నిలబడుతుంది. “మా” ఎన్నికలు కేవలం తొమ్మిది వందల మంది ఓట్లకు సంబంధించిన విషయం కాదు. అది ఇంతకాలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఆధిపత్య దోపిడి వర్గాలను సవాల్ చేస్తున్న శ్రామిక బహుజన వర్గాల ప్రశ్నకు ఇప్పుడు ప్రకాష్ రాజ్ రూపంలో ప్రతిఘటన మొదలైంది.దీంతో గంగవెర్రులెత్తిన ఆధిపత్యవాదుల ప్రతినిధిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉత్పత్తి జాతులైన భారతీయ బహుజన కార్మిక వర్గం తమ శ్రమలో భాగమైన ఆటపాటలతో కూడిన సాంస్కృతిక జీవన విధానంలోకి చొరబడిన ఆధిపత్య దోపిడి వర్గాలు, ప్రజల ఆటపాటలను సైతం తమ దోపిడి గరశల్లో కరెన్సీ కట్టలుగా మార్చుకోని, శ్రమజీవుల పనిపాటల సంస్కృతిని దోపిడి సంస్కృతిగా మార్చివేశారు. నైతిక విలువలకు పాతరేసిన ఆధిపత్య దోపిడి కులాలు, సినిమా ఇండస్ట్రీలో తమ దోపిడి వారసత్వాన్ని శాశ్వతం చేసుకున్నారు.
★ ఒకటి మాత్రం స్పష్టమైంది “మా”ఎన్నికల వేదికగా ఒక విభజన రేఖ ఏర్పడింది.పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించినట్లుగా రాజకీయాలన్న అధికార సౌకర్యం పొందాలన్నఆ రెండు కులాలే అని. నిజమే ఉమ్మడి రాష్ట్రంలో రెండు కులాలు కమ్మ,రెడ్డి చెరికొంతకాలం అధికార మార్పిడి చేసుకునేవారు. ఇప్పుడు పరిస్థితుల్లో క్రమంగా మార్పులకు పునాదులు పడుతున్నాయి. గతంలో బహుజన జాతుల్లో అక్షరాస్యత లేనికారణంగా ఇంత ప్రతిఘటన ఉండేది కాదు. అయితే బహుజన జాతులు ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోవచ్చు కానీ క్రమంగా బహుజన జాతుల్లో రాజ్యాధికారం పట్ల ఆసక్తి పెరుగుతున్నది. ఈ 5,10 సంవత్సరాల్లో కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘననీయమైన సామాజిక మార్పులకు భూమిక ఏర్పడుతందనడంలోఎలాంటి సందేహం అక్కర్లేదు.
దండి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్
బహుజన లెఫ్ట్ పార్టీ-BLP తెలంగాణ రాష్ట్ర కమిటీ, హైదరాబాద్.