ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:
అనంతపురం పట్టణం నందు సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కౌకుంట్ల గ్రామం ఆర్డిటి కాలనీకి చెందిన బూదగవి చంద్ర కుమారుడు గత రెండు రోజుల క్రితం కాలనీలో సైకిల్ తొక్కుతూ ప్రమాదవశాత్తు క్రిందపడి ప్రమాదానికి గురికావడం జరిగింది. ఈరోజు చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి సంబంధిత డాక్టర్ ని బాలుడి ఆరోగ్యపరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులకి ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ తెలిపారు.