AP 39TV 22 ఏప్రిల్ 2021:
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గుంతకల్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక అత్యంత సర్కిల్ లో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్ను అన్ని విధాలుగా ఆదుకోవాలని నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ కార్పొరేట్ టీచర్స్ నౌ చూసీచూడనట్లు వ్యవహరిస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో పనిచేసే టీచర్ ను కలుపుకొని ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వినోద్ కుమార్, రాకేష్ చంద్ర, రోహిత్, ఆనంద్ ,భార్గవ్, షఫీ, వివేక్ ,తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.