AP 39TV 18 ఏప్రిల్ 2021:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు వై. లికిల్ రెడ్డి తండ్రి వై.సూర్యనారాయణ రెడ్డి ఆదివారం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,ఆయన సోదరులు,వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి కలిసి శ్రీనగర్ కాలనీ లోని లికిల్ రెడ్డి నివాసంకు వెళ్ళి సూర్యనారాయణ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లికిల్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే అనంత సోదరులు పరామర్శించారు.