అనంత’లో కదంతొక్కిన జర్నలిస్టులు
పత్రికా స్వేచ్ఛను కోర్టులు హరించడం అన్యాయం
ఏపీ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యం పై దాడి
హైకోర్టు తీర్పు పునఃపరిశీలించాలి
జర్నలిస్టులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి
మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (A.P.J.D.S) డిమాండ్.
✍అమరావతి భూముల వ్యవహారంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని వార్తలు రాయకూడదని ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మీడియా స్వేచ్ఛని కాపాడాలని మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ జాతీయ నాయకులు డిమాండ్ చేశారు.
✍అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు ఉదయం ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి నాయకత్వంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
✍అనంతపురం నగరంలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఏపీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కదంతొక్కినారు, నినాదాలు చేశారు జడ్జిలే మీడియాకు సంకెళ్ళ వస్తే ఎలా మీడియా స్వేచ్ఛను కాపాడాలని అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ విలువల్ని పరిరక్షించాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.
✍ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు కేంద్రం కలుగజేసుకుని జర్నలిస్టులకు న్యాయం చేయాలని పత్రికా స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు.
✍హైకోర్టు ఇచ్చిన తీర్పు జర్నలిస్టులకు షాక్ కు గురిచేసిందని జర్నలిస్టులకు అండగా ఉండాల్సిన న్యాయస్థానం ఈ విధంగా తీర్పు ఇవ్వడం వల్ల జర్నలిస్టులకు రక్షణ కారువవుతుందని ఇది ప్రమాదకరమైన తీరు అని మచ్చా రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
✍సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా ఉంటామని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు.
✍హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వార్తలు స్వేచ్ఛగా ఇచ్చే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించాలని ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి కోరారు.
?ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు,ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు శివారెడ్డి, విజయరాజు, శివప్రసాద్, శ్రావణ్, బాలాంజినేయులు, సాకే జానీ, షాకీర్, ఆది, నాయక్, పరంధామా, శివానంద, ఆదినారాయణ హనుమంత్ రెడ్డి, నాగేంద్ర వేణుగోపాల్, హరి, మహిళ జర్నలిస్టులు రాజియా, ప్రియాంక, మమత పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్లు, చిన్న పత్రికాల ప్రతినిధులు పాల్గొన్నారు.
?A.P JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU DIST
https://www.youtube.com/watch?v=5iVavkmhJtE&feature=youtu.be