Header Top logo

ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలను, టీచర్లను ఆదుకోండి

AP 39TV 20 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘము (ADPSA) జిల్లా కార్యాలయం లో కరస్పాండెంట్ ల సమావేశం జరిగినది. ఈ సమావేశ ము లో గత సంవత్సరం నుంచి కరోనా కల్లోలం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాఠశాలలకు ఈ సంత్సరము కూడా మరొకసారి అత్యవసరంగా పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, టీచర్స్ ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దయతలచి తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఇస్తున్న భృతి మాదిరి గానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలి అని, అలాగే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సహాయ సహకారాలు అందించాలని, అద్దె భవనాల్లో స్కూల్స్ నడుపుతున్న ప్రైవేట్ స్కూల్స్ వారికి 50 శాతం అద్దె చెల్లించాలి అని, విద్యుత్ చార్జీల లో రాయితీ ఇవ్వాలి అని, ప్రైవేట్ స్కూల్స్ నుంచి వసూలు చేస్తున్న వివిధ రకాల పన్నులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కరోనా కారణంగా అర్ధాంతరంగా పాఠశాలలు మూత పడిన కారణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడము సాధ్యం కాదని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అయితే ప్రశ్నపత్రాల కొరకు ప్రైవేట్ స్కూల్స్ వారు రుసుము చెల్లించారు. అయితే పరీక్షలు జరుగనందువల్ల రుసుము తిరిగి చెల్లించాలని DCEB చైర్మన్, DEO ని, ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ అయిన ప్రతాపరెడ్డి ని ఫోన్ ద్వారా సంప్రదించగా చెల్లించిన ఈ రుసుము మొత్తాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి సర్దుబాటు చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, CRO రవిచంద్రారెడ్డి , నగర గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నగర అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, నగర కోశాధికారి వేణు మనోహర్, జానకిరాములు, శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking