Header Top logo

Specialties of Dasara Navadurg

Specialties of Dasara Navadurg

దసరా..  నవదుర్గాల ప్రత్యేకతలు

శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. దేవీ భాగవతం, దుర్గ సప్తశతి, మార్కండేయ పురాణంలో దుర్గాదేవి మహాత్మ్యం వర్ణించ బడింది. “ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణీ! తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకమ్! పంచమం స్కంద మాతేతి షష్టం కాత్యాయనీతి చ! సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాప్టకమ్! నవమం సిద్ధిధాద్రీచ నవ ర్గా: ప్రకీర్తితా! ఉక్తాన్యేతాని నామాని   బ్రాహ్మణ ఇవ మహాత్మా!! దేవిని తొమ్మిది అవతారాలు తొమ్మిది దినాలు రూపానికి తగిన అలంకారాలతో, ఆయుధాలతో నవదుర్గలుగా ప్రత్యేకంగా పూజించడం సంప్రదాయం. మొదటి రోజున “శైలపుత్రి” దుర్గ… నంది తన వాహనంగా కుడిచేత త్రిశూలాన్ని, ఎడమచేత పద్మ పుష్పాన్ని ధరించి దర్శనమిస్తుంది. రెండో రోజు “బ్రహ్మచా రిణి”గా దేవి తపోదీక్షాధారిణిగా కన్పిస్తుంది. కుడిచేత రుద్రాక్షమాల ఎడమ చేత కమండలం ధరించి ఉంటుంది. మూడో రోజున దేవి చంద్రఘంట”గా పిలువ బడుతుంది. ఈ రూపంలో దేవి దశహస్తాలతో, పది చేతులలో పది ఆయుధాలు, సింహ వాహనారూఢయై ఉంటుంది. షోడశ కళల చంద్రుని రూపం. ఈ దినాన ఘంట రూపంలో కన్పిస్తుంది.

నాలుగో రోజున “కూష్మాండ దేవి”గా కొలుస్తారు. సృష్టికి మూలమై చిద్విలాసంతో సృజించినది కావున వర్తుల విశ్వాన్ని కూష్మాండం, గుమ్మడికాయతో పోలుస్తూ, కూష్మాంగా వ్యవహరిస్తారు. ఎనిమిది చేతులు కలిగి ఉండే రూపమై నందున “అష్టభుజ” అని కూడా అంటారు. ఏడు చేతుల్లోనూ వరుసగా విల్లు, బాణం, పద్మపుష్పం, అమృతకలశం, చక్రం గద ధరించి, ఎనిమిదో చేతిలో రుద్రాక్షలతో దర్శనమిస్తుంది. ఈదేవికి కూష్మాండం బలికి ప్రముఖ స్థానమై, ప్రీతికరమైనది ఐదవ రోజున “స్కందమాత”గా దేవి లోకి ఖ్యాతి చెందింది. కార్తికేయుని తల్లిగా నాలుగు చేతులతో, ఊర్ధ్వ దక్షిణ హస్తంలో స్కంద బాలుడిని, అధో దక్షిణ హస్తంలో పద్మాన్ని, ఊర్ధ్వ వామ హస్తంలో ఆశీర్వాద ముద్రను, అధో దక్షిణ హస్తంలో పద్మాన్ని ధరించి, పద్మంపై కూర్చుని ఉంటుంది. అందుకే “పద్మాసనం”గాపిలుస్తారు. సింహవాహనగా దర్శనమిస్తుంది. ఆరవ రూపం కాత్యాయని” బంగారు ఛాయతో తళుకులీను తుంటుంది. కుడిచేయి ధైర్యస్వైర్యాలను కలిగించే రీతిలో ఉంటుంది. దిగువనున్న చేయి వరదాయిని ముద్రలో, ఎడమ వైపున ఉన్న పై చేయి ఖడ్గం, దిగువనున్న చేతిలో పద్మం ధరించి, సింహవాహనయై దర్శనమిస్తుంది. దురర్గాదేవి ఏడో రూపం “కాళరాత్రి” నల్లగా, జుట్టు విరబోసుకుని, మెరుపుల కాంతులు వెదజల్లే గళముతో త్రినేత్ర పై, నిప్పులు కక్కుతూ, జ్వాజ్వాల్యమానంగా గార్థభ

వాహనాసీనయై, చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. కుడివైపు ఒకచేత అభయంకర ముద్ర, మరొక చేత తేజోపరాక్రమ దాయిని ముద్ర, ఎడమ వైపున పైచేత ఇనుప ఛురిక, మరొకచేత కొడవలి ధరించి భయానక కాళరాత్రి రూపేణ చెడుని ధ్వంసించే విలయ కారిణి ఈ మహిమాన్విత మూర్తి. ఎనిమిదవ రూపంలో “మహాగౌరి”గా ధవళ ధావళ్య విలాసినిగా దేవి ప్రశాంతత, పరి శుద్ధతకు ప్రతీకగా, శ్వేత వస్త్రాంబర ధారిణియై నంది వాహనంగా, కుడివైపు పైచేత సర్వభయ హారిణి దిగువ చేత త్రిశూల ధారిణిగా ముద్రలు కన్పిస్తుంటే, ఎడమ వైపున ఢమరుకం పైచేత, దిగువ చేత వరదాయిని ముద్రతో దేవి దర్శనమిస్తుంది. తొమ్మిదవ దినాన మహర్నవమి నాడు నవదుర్గలలో చివరి రూపమైన “సిద్ధిధాత్రి”గా- విజయాన్ని సిద్ధింప చేసే శక్తిశాలినిగా, అష్టసిద్ధులూ ప్రసాదించే సర్వశక్తిమయీ, సాక్షాత్తూ శివుని సాయుజ్యం ప్రసాదించ గలిగిన ఆదిశక్తిగా పూజలందుకునే తల్లి సిద్ధిధాత్రి. కుడివైపు పైచేతిలో ముద్గలం,  దిగువ చేతిలో చక్రం, ఎడమవైపు పైచేతిలో పద్మం, దిగువ చేతిలో శంఖం ధరించి, ఈ దేవి ఒక దశలో పద్మాసనం, మరో దశలో సింహవాహినిగా దర్శనమిస్తుంది. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, గాయత్రిగా, బాలా త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత  సెల్:   9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking