Header Top logo

సింగరేణి ఆల్ టైం రికార్డుగా

సింగరేణి ఆల్ టైం రికార్డుగా డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్ టైం రికార్డు

ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి
సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నాం

ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలి
అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సి అండ్ ఎండి శ్రీ ఎన్. శ్రీధర్
సింగరేణి భవన్, హైదరాబాద్,

 

సింగరేణి సంస్థ 2022 డిసెంబర్ నెలలో తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఉత్పత్తిగా 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందనీ, ఇది గత ఏడాది డిసెంబర్ నెలలో సాధించిన దానికన్నా 19 శాతం అధికమని, అలాగే సగటున రోజుకు 2 లక్షల 18 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపి మరో ఆల్ టైం రికార్డును నెలకొల్పిందని, ఇదే ఒరవడితో మిగిలిన 3 నెలల కాలంలో ఉత్పత్తి, రవాణా సాధించాలని ఛైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్. శ్రీధర్ కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం నాడు ఆయన సింగరేణి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో డిసెంబర్ నెల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking