Header Top logo

మార్చి 12 నుంచి ఎస్ఐ కానిస్టేబుల్‌ మెయిన్స్ ఎగ్జామ్స్

ఎస్​ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం ప్రకటించింది.  

మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 23 దాకా ఫైనల్ ఎగ్జామ్స్‌ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బోర్డు చైర్మన్​ వీవీ శ్రీనివాస్‌ రిలీజ్​ చేశారు. పోయిన నెల 8న ప్రారంభమైన ఫిజికల్​ టెస్ట్​లు ఈ నెల 5తో ముగియనున్నట్టు ప్రకటించారు.

 ఈవెంట్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్​ ఎగ్జామ్​కు రెడీ కావాలని సూచించారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. ప్రతీ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా, మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల దాకా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking