Should live the ideal ఆదర్శంగా బతకాలి
Should live the ideal
“ఆదర్శంగా బతకాలి”
అలసిపోయాను
ఈ సంతలోని వింతలను చూసి!!…
ఈ సమాజంలోని పోకడలను చూసి!!..
సహజత్వాని వదలి
నిజ జీవన సత్యాన్ని విడిచి
కృత్రిమ చూపులతో నడకలు…
ఇపుడు అంతరంగమంతా
అనర్థాలదారులే!!…
మనసంతా కృతిమమయమే!!…
హృదయమంతా కృత్రిమమే!!…
సహజత్వం లేని మనిషితత్వం…
ఇవి చూడలేక అలసిపోయాను!!…
మనిషి మనసంతా ఉగ్రవాదమే!!…
హృదయమంతా ఉద్రేకమే!!…
నిజమైన మనిషితనాన్ని
తెలియని మబ్బుపొరలు కమ్మేసినవి..
అందమైన సహజత్వాన్ని తొక్కేసినవి..
ఇప్పుడు మనిషి కోరికల కొండల్లో
ఆశలడొంకల్లో స్వార్థపు సంకుచితాల సరిహద్దుల్లో… నిప్పులు చెరిగే ఆవేశపు
ఉరుకుపరుగుల్లో ఉన్నాడు…
విషాదాలు ఎదురైనా…
ఉషోదయం అనుకుంటూ
ముందుకు నడుస్తున్నాడు…
అందుకే చూడలేక పోవుచున్నాను…
సంపాదించే ధ్యాసతప్ప…
సంసారం గురించి ఆలోచించరు!!….
ఇదో పరుగుల జీవితం!!…
మానవత్వాన్ని దాటేసి..
ఎన్నెన్నో మైలురాళ్లు దాటుతున్నారు…
నిజమైన బతుకుదారులన్నీ మూసుకుపోతున్నాయి…
దేన్నో..దేనికో…వెతుక్కుంటూ
చివరికి సమస్యల వ్యూహంలో
ప్రశ్నార్థకమై నిలిచిపోతున్నారు!!…
మనసులో ఓ కల్లోలం!!…
గుండెలో ఓ విస్ఫోటనం!!…
తెలియని ఆరాటంలో మునిగిపోతున్నారు…
అనుబంధాల పిలుపులులేవు…
ఆత్మీయుల చూపులులేవు…
ఎప్పుడూ ఏదో గుండెలో అలజడి!!…
ఇప్పుడు ద్వేషం..మోసం దూసుకుపోతున్నాయి!!…
అగాధాలు విషాదాలు చుట్టేసినవి!!…
ప్రేమ,కరుణ,పడిపోతున్నాయి…
అందుకే ఈ విచిత్ర దృశ్యాలను
చూడలేకపోవుచున్నాను…
మనసంతా వేదన…
హృదయమంతా రోదన!!
చూపులు బరువెక్కినవి…
దశాబ్దాలు దాటినా
మనుషుల దశ తిరగలేదు!!…
నడక నడతమారలేదు…
నిత్యం ఓ ఉద్యమ పోరాటమే!!…
మద్దతు దొరికే వరకు…
అడుసుతో నిండిన మడుగులో నడక
అందినచోటల్లా అంది పుచ్ఛుకోవడమే!!
అందుకే సహజత్వాన్ని వదులొద్దు!!
తెలియని కోరికలవెంట పరుగుతీయొద్దు!!…
పదిమందిని ఒప్పించి మెప్పించే పనిచేయాలి!!…
అందరిలో ఆదర్శంగా బతకాలి!!
అంబటి నారాయణ
నిర్మల్ 9849326801