దుగుమర్రి గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి, గొర్రెల కాపరి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన-ఆలూరు సాంబశివా రెడ్డి
AP 39TV 08మార్చ్ 2021:
నార్పల మండలం దుగుమర్రి గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 48 గొర్రె పిల్లలు మృతి చెందాయి, మరో 22 గొర్రె పిల్లలు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివ రెడ్డి తక్షణమే గొర్రెల కాపరి కుటుంభాన్ని పరామర్శించి, రూ” 52,000/- ఆర్థిక సహాయం అందజేశారు.