Header Top logo

ప్రధాన రోడ్లపై మురుగు నీరు నిల్వ

AP 39TV 22 ఏప్రిల్ 2021:

మడకశిర : అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే నిరంతరం మురుగునీరు నిండి ఉంది. దోమల వ్యాప్తిని పెరిగే ప్రమాదం ఉంది. అయితే సానిటేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టణ ప్రజలకు శాపంగా మారిందని అనడానికి నిదర్శనమే ఈ కథనం. చిన్నపాటి వర్షం కురిసిన డ్రైనేజీ కాలువలు శుభ్రం, రోడ్లపైకి వర్షం నీరు చేరి మోకాళ్ల బోతులో నీరు నిల్వ ఉంటూ ప్రజలకు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ప్రతి ప్రభుత్వ ఆఫీసులకు పోవాలన్నా వార్డు సచివాలయకు ప్రజలు రావాలన్నా మోకాళ్ళ బోతులో నీరు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితి ఎక్కడో కాదు మన మడకసిరా పట్టణంలోని 11, 13, 17, వ వార్డు లో కర్ణాటక బ్యాంక్ మరి స్టేట్ బ్యాంక్ వద్ద.తదితర ప్రధాన రోడ్డు పైన ఈ మురుగు నీరు ఏరులై పరుతుంది. రోడ్డుపై ఉన్న మురుగునీరు దుర్వాసన వెదజల్లుతూ ఉందని.ఈ కాలనీలలో మరియు పట్టణంలో శానిటేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కురిసిన వర్షానికి డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో కాలువల్లో నీరంతా వెళ్ళకుండా రోడ్లపైకి వచ్చాయి . ఈ నీరంతా కూడా ప్రధాన రోడ్లపై ప్రభుత్వ ఆఫీసులకు వచ్చి వెళ్లే ప్రజలు విరంతా మోకాళ్లలోతూ మురుగునీరు నిల్వ ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో దాదాపు 40 కు పైగా కరోనా వ్యాధి కేసులు వ్యాప్తి పెరుగుతుంది. మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ మురుగునీరు అంత ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే మురుగునీరు గా మారి దోమల వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది. శానిటేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం లేదు దోమల వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుంది కాలువల్లో పందులు సంచరిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు. మున్సిపల్ చైర్ పర్సన్.20 వార్డు కౌన్సిలర్ లు సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking