Serpentine జన విజ్ఞాన వేధిక సర్పదోషం
Serpentine
జన విజ్ఞాన వేధిక – సర్పదోషం పేరుతో..
ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురౌతున్నాయి. పైగా అనవసరంగా అప్పులు బాధ పెరిగిపోతోంది. ఓ సారి జాతకం చూపించుకుందామని ఓ యూట్యూబ్ సిద్ధాంతి రామారావుని కలిసాడు సుబ్బారావు.
ఆయన వివరాలు విని, చక్రం వేసి నీకీ సమస్యలు పాముల్ని చంపడం వల్ల వచ్చిన సర్పదోషం. శాంతి చేయించండి అన్నాడు సిద్ధాంతి.
అయ్యా! లేదయ్యా నేనసలు పాముల్ని చంపలేదయ్యా అన్నాడు సుబ్బారావు.
కళ్ళు మూసుకుని సిద్ధాంతి గంభీరంగా మీ చిన్నప్పుడు ఎప్పుడైనా కడుపు నెప్పి, అరగక పోవడం, ఆకలి లేకపోవడం ఉండేదే..? అడిగాడు సిద్దాంతి.
సుబ్బారావు గుర్తు తెచ్చుకుని ‘ఆ..ఆ’ నా చిన్నతనంలో కడుపులో ఏలిక పాములున్నాయని ఓ డాక్టర్ గారు మందిచ్చారు అన్నాడు.
ఆ… చూశారా! నే చెప్పలా! పాము అంటే నాగుపామే కాదు. ఏ పామైనా పామే. మీ కడుపులో పాముల్ని మందు వేసి చంపేశారు కదా. అదే దోషం. Serpentine సర్ప దోషమే అన్నాడు యూట్యూబు సిద్ధాంతి.
ఆ….ఆ… అని శాంతి చేయించండి ఎంతైనా ఫర్లేదు అన్నాడు సుబ్బారావు.
గమనిక: జాతకం నేర్చుకోవడమే కాదు,చెప్పడం రావాలి.అర్దమౌతోందా?
- లక్ష్మీ నరసింహం జయంతి, జన విజ్ఞాన వేధిక