Header Top logo

ఎమ్మెల్యే గూడెం మ‌హీపాల్ రెడ్డిపై ప్ర‌ధాని మోదీకి ఫిర్యాదు

  • మ‌హీపాల్ రెడ్డిపై సీబీఐ ఎంక్వైరి జ‌రిపించాలి.
  • భూముల ఆక్రమణలపై పూర్తి విచార‌ణ చేయాలి.
  • అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న ఎమ్మేల్యే కుటుంబ స‌బ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి.
  • బీజేపి సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మేల్యే నందీశ్వ‌ర్ గౌడ్ ప్ర‌ధానికి ఫిర్యాదు.

క‌లంగ‌ళం, ప్ర‌తినిధి: టీఆర్ఎస్ సర్కార్ అండతో తన కుటుంబ సభ్యులను అడ్డంపెట్టుకుని భూ ఆక్రమణలకు పాల్పడుతున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలపై బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ప్రధాని నరేంద్రమోడీకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమాలు పాల్పడుతున్నారని ప్రధానికి వివరించారు. ఆయన చేస్తున్న అక్రమాలు రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనకు అద్దం పడుతుందని అన్నారు.

Senior BJP leader and former MLA Nandeeshwar Gowda has lodged a complaint with the Prime Minister MLA Gudman Mahipal Reddy.

ఈ సందర్భంగా నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదు పత్రాన్ని మోదీకి అందించారు . ప్రధాని మోదీ శనివారం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో నందీశ్వర్ గౌడ్ మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు . పఠాన్ చెరు ప్రాంతంలో స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి , అతని సోదరుడు ప్రభుత్వ , ప్రైవేట్ భూముల ఆక్రమణ , కబ్జాలకు పాల్పడుతున్నారని మోడీకి తెలిపారు . అధికారం చేతిలో ఉందని నియోజకవర్గంలో వేల కోట్ల కుంభకోణం చేశారన్నారు . ఆయన చేస్తున్న అవినీతి , అక్రమాలపై సీబీఐ చేత పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .

Senior BJP leader and former MLA Nandeeshwar Gowda has lodged a complaint with the Prime Minister MLA Gudman Mahipal Reddy.

నియోజకవర్గంలోని చెరువులు , కుంటలు , వక్ఫ్, దేవాలయం , స్మశాన , ప్రైవేటు భూముల , ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మోడీకి వివరించారు . ప్రభుత్వ అధికారుల అండదండలతో భూమి యజమానులను బెదిరించి బలవంతంగా భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని నందీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు . ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూ ఆక్రమణలు , కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రధానికి వివరించారు . భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు .

Senior BJP leader and former MLA Nandeeshwar Gowda has lodged a complaint with the Prime Minister MLA Gudman Mahipal Reddy.

దేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గా కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా నందీశ్వర్గాగౌడ్ మోదీకి పాత కేసు వివరాలు వెల్లడించారు . ఆయన చేసిన అక్రమాలపై గతంలోనే ఓ కేసులో కోర్టు శిక్ష విధించగా రాష్ట్ర ప్రభుత్వ అండతో ఇంకా ఎమ్మెల్యే కొనసాగుతున్నారని మోదీకి వివరించారు . సీబీఐ విచారణ ద్వారా అక్రమాలు బయట పెట్టి చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు నందీశ్వర్ గౌడ్ తెలిపారు . ఈ విషయంపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని నందీశ్వర్ గౌడ్ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking