Anantapur – Enforcement work
అనంతపురం జిల్లా డి.హీరేహాల్ ఎస్సై వలీబాషా ఆధ్వర్యంలో పోలీసులు మరియు రాయదుర్గం సెబ్ విభాగం పోలీసులు సంయుక్తంగా నిషేధిత గుట్కా పదార్థాలు, ఇతర రాష్ట్రాల మద్యం నియంత్రణలో భాగంగా దాడులు నిర్వహించారు. మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి రూ. 16,800/- ల విలువ చేసే నిషేధిత గుట్కా పదార్థాలు మరియు 164 టెట్రా పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.