Header Top logo

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రధాన వైద్యుడు వెంకటేశ్వరరావు ను కలసిన – రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి

AP 39TV 03మే 2021:

కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చుతోందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యులే పేద ప్రజల అనారోగ్యాలకు భరోసా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, TNTUC జిల్లా నాయకుడు మేకల వెంకటేష్ గౌడ్,ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌస్ పీర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దూదేకుల రఫీ,సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సురేంద్ర, బీసీ సెల్ కార్యదర్శి గోపాల్ గౌడ్ సోమవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రధాన వైద్యుడు వెంకటేశ్వరరావు ను కలసి కరోనా వ్యాధి గ్రస్థుల పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రికి వస్తున్న రోజువారీ కరోనా బాధితుల సంఖ్య, రెమ్ డేసివిర్ ఇంజెక్షన్ వినియోగం,రోగులకు వైద్యసదుపాయం,ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ ప్లాంట్ పనితీరు,కరోనా మరణాలు, రోజువారి డిశ్చార్జ్ సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుండి కోవిడ్ రోగులు వస్తున్నారని వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ నాయకులు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును కోరారు. కరోనా పేషెంట్ లలో అవసరమైన వారికి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో కరోనా మరణాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే చనిపోతామేమో అనే భావన గత రెండురోజులుగా జిల్లా ప్రజల్లో నాటుకుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.సర్వజన ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందకపోవడం,ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ లో చోటు చేసుకున్న సాంకేతిక కారణాలతో కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా అందక పోవడంతో రోజురోజుకు మరణాలు పెరుగుతున్నట్లు దినపత్రికల్లో రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పోతోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు.ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వాస్తవంగా జరుగుతున్న కరోనా మరణాల రేటు,అధికారులు చెబుతున్న మరణాల రేటుకు పొంతన లేకుండా ఉందన్నారు.ప్రజల్లో అపోహలు తొలగాలంటే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న కోవిడ్ అడ్మిషన్లు,ఆక్సిజన్ సరఫరా,కరోనా బాధితుల భోజన ఏర్పాట్లు, మరణాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలతో స్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. ఏదిఏమైనా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉందన్నారు.అనంతరం టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పందిస్తూ కరోనా రోగులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన భోజనం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని మరణాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking