ఏపీ39టీవీన్యూస్
గుడిబండ:- మండల కేంద్రంలోని సుమారు 130 కుటుంబాలు ముస్లిం సోదరులు నివసిస్తున్నారు గతంలో వీరికి ప్రభుత్వం ద్వారా స్మశాన వాటిక కోసం రెండు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది అందులో 32 సెంట్ల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా పట్టా పొందారు విషయం తెలుసుకున్న ముస్లిం సంఘం పెద్దలు తహసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో తహసిల్దార్ ఇద్దరు వ్యక్తులను పిలిపించి విచారణ చేయగా స్థలాన్ని తిరిగి ముస్లిం సోదరులకు అప్పగిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా లాయర్ నోటీస్ పంపడం ఎంతవరకు న్యాయమని ముస్లిం సోదరులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారించి మాకు న్యాయం చేయాలని ముస్లిం సోదరులకు సంబంధించిన స్థలాన్ని మా అందరికీ ఇప్పించాలని గుడిబండ తహసీల్దార్ మహబూబ్ పీరా కు వినతిపత్రం అందించి ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ