Header Top logo

కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులలో రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పుంజుకోవడానికి అడుగులు ముందుకు వేస్తోంది.

కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ ఉనికిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటైన ప్రశ్నలతోె కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రజలవద్దకు వెళుతున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ కుమ్మలాటాలు.. సీనియర్ – జూనియర్ గొడవలతో పార్టీని నష్టం చేస్తున్న పెద్దల గురించి అధిష్టాన వర్గం చూసుకుంటుందనే దీమాతో రేవంత్ పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువ కావడానికి సిద్దమవుతున్నారు. 

దశ దిశ నిర్ధాశం చేసిన పీసీసీ చీప్ 

అందులో భాగంగానే బుధవారం హైదరాబాద్ బోయిన్ పల్లి లో  కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దశ దిశ నిర్ధాశంతో పాటు రాబోయే కాలంలో అధికారంలోకి రావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సిద్దంగా ఉండాలని సూచన చేశారు రేవంత్ రెడ్డి. 

కేసీఆర్ స్టైల్ లో ప్రజలు ఆలోెచించే విధంగా రేవంత్ రెడ్డి స్పీచ్ కొనసాగింది.  భీఆర్ ఎస్ పేరుతో దేశ వ్యాప్తంగా విస్తరించడానికి వెళుతామని ప్రకగించిన కేసీఆర్ ను ఉద్దేశించి…

ఏపీ, తెలంగాణ విభజన వివాదాలపై కేసీఆర్ ఏ వైపు ఉంటారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలదీశారు.

ఆనాడు పోలవరం పొక్క కొట్టి ఆంధ్రావాళ్లు నీళ్లను తరలించుకు పోతున్నారన్న కేసీఆర్.. ఇప్పుడు జగన్ ను ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నించారు.

 ధరణి సమస్యలు, హాత్ సే హాత్ జోడో అభియాన్ తో పాటు వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.

జాతీయ పార్టీ పేరుతో తెలంగాణపై కేసీఆర్ వైఖరిని రేవంత్ ప్రశ్నించారు.

“పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ తెలంగాణా వైపు ఉంటాడా? రాయలసీమ వైపు ఉంటాడా?. గోదావరి, కృష్ణా వివాదాలపై నువ్ ఆ గట్టున ఉంటావా..

ఈ గట్టున ఉంటావా? ఆస్తుల విభజనలో కేసీఆర్ ఎవరివైపు ఉంటాడో చెప్పాలి.

1200 మంది విద్యార్థుల బలిదానాలు చేసింది ఇందుకేనా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు రేవంత్ రెడ్డి. 

హజరైన అసంతృప్త నేతలు..

పీసీసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, మల్లు రవితో పాటు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో పాటు కాంగ్రెస్ అసంతృప్త నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోందడ రాంరెడ్డి హాజరయ్యారు.

పార్టీ పీఎసీ, పీఈసీ, అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని విభాగాల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. హాత్‌సే హాత్‌ జోడో అభియాన్‌తో పాటు ధరణి సమస్యలపై పోరాటం, ఎన్నికల నిబంధనలు, బీమా, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై శిక్షణా తరగతుల్లో అవగాహన కల్పించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking