Header Top logo

G.O.77ని రద్దు చేయాలని MLA అనంత వెంకటరామిరెడ్డి కి వినతి – (NSUI)

NSUI రాష్ర్ట నాయకులు నరేష్ యనుమల,
NSUI జిల్లా అధ్యక్షులు కొనపురం రాంబాబు.

రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రద్దుకై తీసుకొచ్చిన GO 77ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అనంతపురం శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామిరెడ్డి కి NSUI రాష్ర్ట నాయకులు నరేష్ యనుమల, జిల్లా అధ్యక్షులు రాంబాబు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా NSUI రాష్ర్ట నాయకులు నరేష్ యనుమల, జిల్లా అధ్యక్షులు రాంబాబు లు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేస్తూ ఇచ్చిన GO NO.77 వల్ల పేద,బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్య అందని ద్రాక్షపండు లాగా తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీ SC, ST, BC, మైనారిటీ విద్యార్థులకు ఫీజురిఎంబెర్స్ మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యని చేరువచేయటం జరిగిందని,ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ప్రైవేట్, ఎయిడెడ్,పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలని ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు రద్దు చేస్తు జారీ చేసిన జీవో నెంబర్ 77 వల్ల అన్ని వర్గాల విద్యార్థులకు 2020- 21 సంవత్సరం నుండి బోధనా ఫీజుల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పేద, మధ్య తరగతి విద్యార్థులను పోస్టుగ్రాడ్యుయేషన్,ఉన్నత విద్య కి దూరం చేయడమేనని, ఈ GO 77 వల్ల రాష్ర్టా వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు,వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకి దూరమై,ఉపదికోసం వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పదుతోందన్నారు. మీరు విద్యార్థుల సంక్షేమం కోసం, తండ్రి ఆశయాల కోసం నిజంగా పాటుపదుతుంటే రాష్ర్తవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య కి సరిపడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, పీజీ కళాశాలల్లో సీట్లు పెంచి,ప్రైవేటు విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో రద్దు చేసి,ప్రభుత్వ విద్యసంస్థలో అన్ని వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రానున్న రోజుల్లో NSUI ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తబ్బు,దాదాఖలందర్ ప్రసాద్, చైతు,నరేంద్ర,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking