Header Top logo

Relatives of Mudiraj Let’s think ముదిరాజ్ లారా ఆలోచన చేద్దాం-02

 ముదిరాజ్ బంధువుల్లారా ఆలోచన చేద్దాం.. -02

Relatives of Mudiraj Let’s think 02

యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, జర్నలిస్ట్
——————-

‘‘ఆ ముగ్గురు… ఔను.. ఆ ముగ్గురే ముదిరాజ్ లీడరులా…? నిజానికి మన ముదిరాజ్ లు ఉన్నత పదవులు అలంకరిస్తే ఆనంద పడాలి. మరీ.. ఆ ముగ్గురి గురించి చాలా మంది నెగిటివ్ గా ఆలోచించడం ఏమిటి…?’’ మనసులో అనుకున్నాడు జర్నలిస్ట్ రమేష్ ముదిరాజ్.

 

ఆ ముగ్గురు అనగానే ఆ గదిలో సీరియస్ వాతవరణం కనిపిస్తోంది.

 

‘‘ఆ ముగ్గురు అంటే పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్, ఈటెల రాజేంధర్, బండ ప్రకాష్ గార్లే గదా..’’ అన్నాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘సరే..  ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్, ఈటెల రాజేంధర్, బండ ప్రకాష్ ఈ ముగ్గురు నాయకులు మూడు రాజకీయ పార్టీలలో ఉన్నారు గదా.. ఇప్పటి పరిస్థితులలో వీరి వల్ల మన జాతికి లాభమా..? నష్టమా..??’’ ప్రశ్నించాడు జర్నలిస్ట్ రమేష్.

 

‘‘ఇంత కాలం మన జాతి కోసం ఈ ముగ్గురు లీడరులు చేసింది ఏమిటో విశ్లేషించుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి.’’ అన్నాడు పొలిటికల్ లీడర్ ఆధిత్య.

 

‘‘ఈ ముగ్గురు లీడరులే కాదు.  లోకనబోయిన రమణ, ఘనపురం మల్లేష్, అల్ల దుర్గం సురేష్, ఉప్పరి నారాయణ, సురేందర్ బాబు, పిట్టెల నగేష్, బోళ్ల గణేష్, ద్వారం యువరాజ్ ఇగో ఇట్లా ఇరువై మందికి పైగానే మనోళ్లు ముదిరాజ్ సంఘాలు పెట్టుకున్నారు. కానీ.. ఈ ముగ్గురు లీడరులే ముదిరాజ్ జాతీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నట్లు భావించి పొలిటికల్ లీడరులు ప్రధాన్యత ఇస్తున్నారు.’’ అన్నాడు రిటైర్డ్ లెక్చరర్ ప్రకాష్.  

 

‘‘ఇప్పటికైన మన ముగ్గురు ముదిరాజ్ లీడరులు జాతీ కోసం ఏమి చేశారో చర్చించుకోవడం చాలా ముఖ్యం.’’ అన్నారు జర్నలిస్ట్ రమేష్.

 

‘‘ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. 2003లో కాసాని జ్ఞానేశ్వర్ గారు హైదరాబాద్ ప్యారేడ్ గ్రౌండ్ లో ముదిరాజ్ ల ప్రభంజనం సభ నిర్వహించడం వల్లే మన సత్తా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.’’ అన్నారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.

 

‘‘కాసాని జ్ఞానేశ్వర్ వల్లే ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని చెప్పడంలో తప్పు లేదు. కానీ.. ముదిరాజ్ లను బిసి (డి) నుంచి బిసి (ఎ) లోకి మార్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడానికి  కూడా అతను తీసుకున్న నిర్ణయాలే  కారణమంటారు. కాసానిని నమ్ముకుని రాజకీయంగా ఎదుగాలని చూసిన అతని అనుచరులు కాసాని తప్పుడు రాజకీయ నిర్ణయాల వల్ల ఎటు కాకుండా పోయారనే టాక్ ఉంది. అయినా.. బిసి డి నుంచి బిసి ఎ లోకి మార్చాలని సుప్రీం కోర్టులో కేసు వేసి దానికి అయ్యే ఖర్చులు భరించడం మాత్రం గ్రేట్. ’’ అన్నాడు జర్నలిస్ట్ రమేష్.

 

‘‘ఔనా నిజమా..? నమ్మలనిపిస్తాలేదు. క్లారిటీగా చెప్పు.’’ ప్రశ్నించాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు 2001లో తెలుగు దేశం పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ పదవి ముగియగానే 92 కులాలతో ‘మన పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు అతను. ప్రజారాజ్యంతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న కాసాని గారు ప్రజా ప్రతినిధిగా గెలువలేక పోయారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ముందు చూపుతో కాసానితో పాటు కాంగ్రెస్ నాయకులు బండ ప్రకాష్ లతో చర్చించిన తరువాతనే ముదిరాజ్ లను బిసి (డి) నుంచి బిసి (ఎ) లోకి మార్చుతూ జీవో 15  తీసుక వచ్చారు.  అదే సమయంలో వైఎస్ ఆర్ తో కాసానికి మధ్య కుదిరిన ఒప్పందంకు కాసాని గారు కట్టుబడి ఉండక పో్వడం వల్లే రజకులతో కోర్టులో వైఎస్ ఆర్ కేసు వేయించారనేది నిజం. కాలక్రమంలో  కాసాని గారు పెట్టిన ‘మన పార్టీ’ వల్, అతని రాజకీయ పిల్లి మొగ్గల వల్ల చాలా మంది అతని అనుచరులకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోయింది.’’ వివరించాడు పొలిటికల్ లీడర్ ఆధిత్య.

 

‘‘సరే..  ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్, ఈటెల రాజేంధర్, బండ ప్రకాష్ ఈ ముగ్గురు నాయకులు మూడు పార్టీలలో ఉన్నారు గదా.. ఇప్పటి పరిస్థితులలో వీరి వల్ల మన జాతికి లాభమా..? నష్టమా..??’’ ప్రశ్నించాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘ఇంత కాలం మన జాతి కోసం వీళ్లు చేసింది ఏమిటో విశ్లేషించుకుంటే మనకు లాభమో నష్టమో అర్థమవుతుంది.’’ అన్నాడు రిటైర్డ్ లెక్చరర్ ప్రకాష్.

 

‘‘‘అది సరే… కాసాని జ్ఞానేశ్వర్ గారు టీడీపీలో చేరడం వెనుక మన జాతి ప్రయోజనాలెమైనా ఉన్నాయా..?’’ అడిగాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘ఇప్పుడు మన ముదిరాజ్ ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో.. ఈటెల రాజేంధర్ బీజేపిలో.. బండ ప్రకాష్ అధికార టీఆర్ ఎస్ లో… ఈ ముగ్గురు స్టేట్ లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే ముదిరాజ్ జాతీ అంత నా వెనుక ఉందని రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వారి స్వలాభం తప్ప జాతీ ప్రయోజనం తక్కువే. అయినా అధికార పార్టీలో ఉన్న బండ ప్రకాష్ గారు ధైర్యం చేసి ముదిరాజ్ ల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తే ముదిరాజ్ ల హృదయాలలో నిలుస్తారు.’’ వివరించారు  పొలిటికల్ లీడర్ ఆధిత్య.

 

‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్ లకు సానుకులంగా ఉందంటునే ఈ ముగ్గురు లీడరుల వల్ల మన జాతికి అన్యాయం జరిగిందనడం బాగా లేదు.’’ అన్నాడు రిటైర్డ్ లెక్చరర్ ప్రకాష్.

 

‘‘ముందుగా మనం ఈటెల రాజేంధర్ గారు గురించి చర్చించుకుందాం. నేను ముదిరాజ్ బిడ్డను, ఆత్మగౌరవం నా రక్తంలో ఉందని బహిరంగంగా ప్రకటించిన ఆ పెద్ద మనిషి మొన్నటి వరకు టీఆర్ ఎస్ లో కీలకమైన వ్యక్తి. 2014 ఎన్నికల టీఆర్ ఎస్ మేనిఫెస్టో కమిటీలో అతను కీలక సభ్యులు. మేనిపెస్టో రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు కూడా.. కానీ.. మన ముదిరాజ్ జాతి ప్రయోజనల కోసం ఆ మేనిఫెస్టోలో ఒక్క ఆంశమైన పొందు పరిచారా..? లేదే.. అదే రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ రమణాచారి గారు తన బ్రహ్మణ జాతీ ప్రయోజనాల కోసం మేనిఫెస్టోలో సమస్యల పరిష్కారం చేస్తామని పొందుపరిచి ఇప్పుడు ఆ ఫలాలు జాతికి అందించారు. ఆ విధంగా ఈటెల రాజేంధర్ గారు ఇతర కులాల నాయకుల్లాగా ఏమి చేయలేక పోయారు. ప్రభుత్వ ఫలాలను మన జాతికి అందించ లేక పోయారు. జాతి ప్రయోజనం కంటే కూడా తన వ్యక్తి గత లాభలు, వ్యక్తి గత ఇగోకే ప్రధాన్యత ఇచ్చారు. మరీ ఇప్పుడు ఈటెల రాజేంధర్ గారు మన జాతిని ఉద్దేరించేవారు అంటే నమ్మేది ఎలా.. మీరు ఆలోచన చేయుండ్రి.’’ అన్నాడు పొలిటికల్ లీడర్ ఆధిత్య.

(మూడవ ఎపిషోడ్ లో కలుద్దాం..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ జర్నలిస్ట్

949 222 5111

Leave A Reply

Your email address will not be published.

Breaking