Header Top logo

Relatives of Mudiraj Let’s think ముదిరాజ ల్లారా ఆలోచన చేద్దాం..-03

ముదిరాజ్ బంధువుల్లారా ఆలోచన చేద్దాం..-03

Relatives of Mudiraj Let’s think-03

యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, జర్నలిస్ట్

————————–

ఈటెల రాజేంధర్ ఆంశం చర్చకు రావడంతో అందరూ ఆసక్తిగా వింటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ వెంట ఉన్న కీలకమైన వ్యక్తులలో ఈటెల ఒక్కరు. మొన్న కేసీఆర్ తో విభేదించే ముందు ‘గులాభి జెండాకు ఓనర్ లం మేమే..’ అంటూ బహిరంగంగా ప్రకటించారు అతను. టీఆర్ ఎస్ ను వదిలి బీజేపిలో చేరే వరకు కూడా టీఆర్ ఎస్ లో ముఖ్యుడుగా కొనసాగారు. మరీ.. మన ముదిరాజ్ ల సమస్యలను మేనిపెస్టోలో ఎందుకు పెట్టలేక పోయారు..?’’ ప్రశ్నించారు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘టీఆర్ ఎస్ వీడినప్పుడే ఈటెల రాజేంధర్ గారికి ముదిరాజ్ బిడ్డను అనే విషయం గుర్తుకు వచ్చింది. మీకు తెలుసా.. ఈటెల రాజేందర్ గారు మావోడు అని మనం (ముదిరాజ్ లం) అనుకుంటాం. రెడ్డిలు కూడా మావోడు అని వారు అనుకుంటారు. ఈటెల రాజేందర్ కొడుకు పేరు నితిన్ రెడ్డి సన్నాఫ్ రాజేంధర్ రెడ్డి అంటూ సర్టిఫికెట్స్ లలో ఉందట. ’’ వివరించాడు పొలిటికల్ లీడర్ ఆధిత్య.

 

‘‘టీఆర్ ఎస్ లో ఉన్నంత కాలంలో ఈటెల రాజేందర్ గారు ఏ ముదిరాజ్ బిడ్డకు సహాయం చేశాడో చెప్పగలరా..? నామినేటెడ్ పదవులు ఇప్పించాలని ఈటెల రాజేంధర్ గారిని కలిసిన గూండ్లపల్లి శ్రీనివాస్, అల్లుడు జగన్, బొక్క శ్రీనివాస్ ల మొఖం మీదనే ‘నా ఇగో చంపుకుని మీకోసం నేను కేసీఆర్ ను నామినేటెడ్ పోస్ట్ లు అడుగలా..?’ అంటూ అనేసాడట.. మీకు గుర్తుండే ఉంటుంది. గుండ్లపల్లి శ్రీనివాస్, నిజ్జన రమేష్, అల్లుడు జగన్, బొక్క శ్రీనివాస్ బృందం ముదిరాజ్ జాతి సమస్యలను పరిష్కారించాలని ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. జాతి కోసం ఉద్యమాాలు చేసే అలాంటి వారికి నామినేటేడ్ పదవులు  రావాల్సి ఉంది.

అంతెందుకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, మన ముదిరాజ్ ముద్దు బిడ్డ ఆకుల రాజేంధర్ గారు  2014లో టీఆర్ ఎస్ టిక్కెట్ ఆశించి టీఆర్ ఎస్ లో చేరితే వారికి టికెట్ రాకుండా అడ్డుపడింది ఈటెల రాజేంధర్ గారు. అదే టిక్కెట్ ను తన భార్య జమున రెడ్డి  బంధువైన కనకరెడ్డి గారికి టిక్కెట్ ఇప్పించాడనేది అందరికి తెలిసిన సత్యం.’’ వివరించారు జర్నలిస్ట్ రమేష్.

 

‘‘ఈటెల రాజేందర్ గారి చొరవతోనే మన బండ ప్రకాష్ గారికి రాజ్యసభ సభ్యులు పదవి వచ్చింది గదా..’’ అన్నాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘నోనో.. బండ ప్రకాష్ గారికి రాజ్యసభ సభ్యులుగా పదవి రావడంలో ఈటెల రాజేంధర్ గారి ప్రమేయం ఇసుమంత కూడా లేదు. టీఆర్ ఎస్ లో ముదిరాజ్ లను ఎదుగకుండా ఈటెల అడ్డుపడుతున్నాడని తెలుసుకున్న కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండ ప్రకాష్  గారిని తానే స్వయంగా పిలిపించుకుని టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యులుగా చేశారు కేసీఆర్ గారు. అంతెందుకు తెలంగాణ పొలిటికల్ జెఎసి కన్వీనర్ గా ఉన్న పిట్టెల రవీంధర్ గారు 2013లోనే  టీఆర్ ఎస్ లో చేరాలని అనుకున్నప్పుడు తప్పుడు సలహా ఇచ్చి అడ్డు తగిలింది ఈటెల గారేనని బహిరంగ రహస్యమే.. టీఆర్ ఎస్ లో కీలకమైన లీడరుగా కొనసాగిన ఈటెల రాజేంధర్ కు సామర్థ్యం ఉండి ఇగో ప్రాబ్లమ్స్ తో ముదిరాజ్ లకు ఉపయోగ పడలేరు. ’’ వివరించారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.  

 

‘‘మరీ.. వీరందరు ఈటెల రాజేంధర్ గారి ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని నేటి వరకు ఎందుకు బహిర్గతం చేయలేక పోతున్నారు.’’ ప్రశ్నించారు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘నిజమే.. ఈటెల రాజేంధర్ గారు తమకు చేసిన అన్యాయాన్ని బహిర్గతం చేయక పోవడం, పత్రికా ముఖంగా ఈటెల గారిని ఖండించక పోవడం వీరు టీఆర్ ఎస్ పార్టీలో గుర్తింపు పొందలేక పోవడానికి ముఖ్య కారణం అయ్యింది. అందువల్లనే వారు నామినేటేడ్ పదవులు పొందలేక పోతున్నారెమో..?’’ వివరించారు జర్నలిస్ట్ రమేష్.

 

‘‘కేసీఆర్ ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్సీ  బండ ప్రకాష్ గారు కూడా ముదిరాజ్ ల డిమాండ్లను ఎందుకు సాధించలేక పోతున్నారు..???’’ ప్రశ్నించాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘హుజురాబాద్ ఉప ఎన్నికల సంధర్భంగా టీఆర్ ఎస్ పార్టీ కోరుకున్నంతగా పార్టీకి బండ ప్రకాష్ గారు ఉపయోగపడలేక పోయారు. ముదిరాజ్ జాతిలో టీఆర్ ఎస్ యొక్క ఉనికిని కాపాడలేక పోతున్నారు. ఈటెల పార్టీకి దూరమై టీఆర్ ఎస్ ను దూషిస్తున్నప్పుడు బండ ప్రకాష్ గారు టీఆర్ ఎస్ అధిష్టానం  కోరుకున్న విధంగా ప్రతి దాడి చేయలేక పోతున్నారు. దీని పర్యావసనంగా టీఆర్ ఎస్ హై కామెండ్ వద్ద బండ ప్రకాష్ గారు తన ఉనికిని కోల్పోయారు. 

అందుకే ముదిరాజ్ జాతి యొక్క కనీష డిమాండ్లను టీఆర్ ఎస్ అధినాయకత్వానికి  విన్నవించలేక పోతున్నారు. ఈ విధంగా బండ ప్రకాష్ గారు అటు టీఆర్ ఎస్ పార్టీకి ఉపయోగపడటం లేదు, ఇటు ముదిరాజ్ జాతికి ఉపయోగపడటం లేదు.  ఇప్పటికైన బండ ప్రకాష్ గారు మేల్కొని టీఆర్ ఎస్ పార్టీలో తన ఉనికిని పెంచుకుని తద్వారా ముదిరాజ్ జాతికి  మేలు చేయాలని యావత్తు ముదిరాజ్ జాతి కోరుకుంటుంది. ’’ అన్నాడు జర్నలిస్ట్ రమేష్.

 

‘‘నక్సలైట్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య గారు ప్రారంభించిన నక్సల్స్ ఉద్యమంలో బండ ప్రకాష్ గారు పని చేశారని పత్రికలలో వార్త చదివాను. అలాగే ఈటెల రాజేందర్ గారు కూడా జనశక్తి నక్సల్స్ గ్రూప్ లో పని చేశారని విన్నాను. పేదల కెోసం పని చేసే నక్సల్స్ గ్రూప్ లలో పని చేసిన వీళ్లీద్దరు ముదిరాజ్ జాతి అభివృద్ది కోసం ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేక పోయారు.’’ ప్రశ్నించారు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.

 

‘‘నక్సలైట్ గా పని చేసిన వీళ్లిద్దరు కూడా తన తత్వానికి విరుద్దంగా ప్రవర్థించడం ముదిరాజ్ జాతికి తగిలిన శాపమెమో..? ’’  అన్నాడు పొలిటికల్ లీడర్ ఆధిత్య.

 

(నాల్గవ ఎపిషోడ్ లో కలుద్దాం..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, జర్నలిస్ట్

949 222 5111

1 Comment
  1. Sriram danaboyina says

    అవును ఈటెల రాజేందర్ ముదిరాజ్ .. ముదిరాజ్ అంటూ అమాయకులైన మన ముదిరాజ్ బిడ్డలు గొంతు చించుకొని మాట్లాడుతుంటే బాదేస్తోంది.అసలు ఈటెల ముదిరాజ్ జాతి కోసం ఏం జేశాడంటే ఏం లేదు.రాజేందర్ గారి బిడ్డకు,కొడుకుకు ముదిరాజ్ బిడ్డలను పెళ్లి చేస్తే కొన్ని ముదిరాజ్ కుటుంబాలు బాగు పడేవి గదా? ఆయన గారు ఏం జేశారు… రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.సరే ఆయన చేసుకున్నాడే అనుకుందాం మరి కొడుకు,కూతురికి మన జాతి బిడ్డలతో వివాహం ఎందుకు జరిపించ లేదు.ఆయన నక్సల్ గ్రూపులో పని చేసినప్పటికీ ఉద్యమ పార్టీ పేరుతో బూర్జువా పార్టీ అయిన టీ ఆర్ ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు కాదనలేం.కానీ ఆయనను మన ముదిరాజ్ జాతి అంతగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.

Leave A Reply

Your email address will not be published.

Breaking