Header Top logo

Relatives of Mudiraj Let’s think ముదిరాజ్ లారా ఆలోచన చేద్దాం 01

ముదిరాజ్ బంధువుల్లారా ఆలోచన చేద్దాం.. 01

Relatives of Mudiraj Let’s think

యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, జర్నలిస్ట్

————————–

తూర్పు దిశన ఉదయించిన సూరీడు పడమర దిక్కు కొండల మధ్య నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణం అవుతున్నాడు. ఎర్రని సూర్య కిరణాలు కనుమరుగు అవుతున్న కొద్ది ఆకాశంలో చంద్రుడు వెలుగును వెద జల్లుతున్నాడు. రోడ్ పక్కనే ఉన్న విద్యుత్ వీధి దీపాలు వెలుగుతున్నాయి. దాభపై నిలబడి తీక్షణంగా చుట్టూ పరిసరాలను నిశీతంగా చూస్తున్న జర్నలిస్ట్ రమేష్ ముదిరాజ్ జేబులో సెల్ ట్రింగ్.. ట్రింగ్.. అంటూ మోగుతుంది. సెల్ ఫోన్ తీసి డిస్ ప్లే పై పేరు చూశాడు అతను.

 

‘‘ఆధిత్య ముదిరాజ్’’ స్ర్కీన్ పై పేరు కనిపించింది.

 

‘‘హాలో బ్రదర్.. ఎక్కడున్నారు..? మీ కోసం వెట్ చేస్తున్నాం..’’ అన్నాడు రమేష్.

 

‘‘ఔనా.. మన మిత్రులు వచ్చారా..?’’ అడిగాడు ఆధిత్య.

 

‘‘ హా.. వచ్చారు. తొందరగా వచ్చేయ్..’’ చెప్పారు రమేష్.

 

హైదరాబాద్ లోని సెంట్రల్ కోర్టులో జరుగుతున్న ప్రత్యేకంగా సమావేశంలో ముదిరాజ్  జాతికి చెందిన లాయర్లు, లెక్చరర్ లు, జర్నలిస్ట్ లు, రిటైర్డ్ ఉద్యోగులు, ఓ యు విద్యార్థులు పాల్గొన్నారు.

 

***   ****   *****

 

‘‘స్వాతంత్ర్యం సిద్దించి ఏడున్నర దశాబ్దాలు గడుస్తోంది. అయినా.. మన ముదిరాజ్ ల బతుకులలో మార్పులు కనిపించడం లేదు. అయ్యా…దొరా అంటూ మనం అడుక్కోవడం కాదు పోరాడి సాధించుకోవడానికి పక్క ప్రణాళిక రూపొందించుకుందాం.’’ అన్నాడు ఆధిత్య ముదిరాజ్. అతను తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అనుభవం ఉంది. అధికార పార్టీలో క్రీయశీల కార్యకర్తగా ఉన్నాడు. అయినా జాతి ప్రయోజనాలు ముఖ్యమని నిక్కచ్చిగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆధిత్య.

 

‘‘మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగాలంటే మన సత్తా చూపించడం ఒక్కటే మార్గం. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే నాయకుడు కావాలి.’’ అన్నారు రమేష్ ముదిరాజ్. అతను ఎంతో కాలంగా జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం ఉంది.

 

‘‘ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం మన డిమాండ్లను సాధించుకోవడమే. కేసీఆర్ ప్రభుత్వం ముదిరాజ్ ల సమస్యలను పరిష్కారించడానికి చొరవ చూపాలంటే రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ఉదృతం చేయాలి.’’ అన్నాడు ఉదయ్ కిరణ్ ముదిరాజ్. అతను  ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ లో ఒక సబ్జెక్ట్ పై  పిహెచ్ డి చేస్తున్నారు.

 

‘‘మన ముందున్న డిమాండ్లపై చర్చను కొనసాగిస్తే భవిష్యత్ ప్రణాళిను రూపొందించుకోవడం సులువుగా ఉంటుంది.’’ అన్నాడు జర్నలిస్ట్ రమేష్ ముదిరాజ్.

‘‘ముదిరాజ్ లను బిసి డి నుంచి బిసి ఎ లోకి మార్చడం.. ఆర్థికంగా ఎదుగడానికి ప్రభుత్వం వెయ్యి కోట్లతో ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం.. రాజకీయంగా ఎదుగడానికి ప్రభుత్వం మనకు నామినేట్ పదవులు ఇవ్వడం. ఈ మూడు డిమాండ్లు మనం సాధించుకోవాల్సిన కర్తవ్యం మన అందరిపై ఉంది.’’ అన్నాడు ఆధిత్య ముదిరాజ్.

 

‘‘ఇంత కాలం మనలను ప్రభుత్వాలు పట్టించుకోక పోవడానికి కారణాలు ఏమై ఉంటాయో విశ్లేషించుకోవడం కూడా ముఖ్యం.’’ అన్నాడు  ఉదయ్ కిరణ్ ముదిరాజ్.

 

‘‘ఇంత కాలం ముదిరాజ్ ల పేరుతో కొందరు రాజకీయ లబ్ది పొందారు. ఆర్థికంగా ఎదిగిన వారు మన జాతి ప్రయోజనాలను పట్టించుకోలేరు. మనమిప్పుడు ఓపెన్ గా చర్చించుకుందాం. ’’ అన్నాడు ఆధిత్య ముదిరాజ్.

 

‘‘మన ముదిరాజ్ జాతి కోసం చిత్త శుద్దితో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రాక పోవడంతోనే మన సమస్యలు పరిష్కరానికి నోచుకోవడం లేవు.’’ అన్నాడు రమేష్ ముదిరాజ్.

 

‘‘మీరు అనేది ఆ ముగ్గురి గురించా…?’’  ప్రశ్నించాడు రిటైర్డ్ లెక్చరర్ ప్రకాష్.

 

‘‘ఔను.. ఇంకా సందేహం ఎందుకు.. మన నాయకులు మనకు అన్యాయం ఎలా చేశారో తెలుసుకుంటే ఇక ముందు ఎవరి నాయకత్వంలో పని చేయాలో ఉద్యమాన్ని ఏ రూపంలో తీసుకెళ్లాలో అర్థమవుతుంది.’’ అన్నాడు ఓయు విద్యార్థి ఉదయ్ కిరణ్.

 

(రెండవ ఎపిషోడ్ లో కలుద్దాం..)

MLA Kidnapped By Naxalights-8

యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ జర్నలిస్ట్

949 222 5111

1 Comment
  1. K Ramesh says

    Super

Leave A Reply

Your email address will not be published.

Breaking