Header Top logo

Questions on Impact ఇంపాక్ట్ వ్యక్తిత్వ వికాసంపై ప్రశ్నలు..

Questions on Impact
ఇంపాక్ట్ వ్యక్తిత్వ వికాసంపై లేవనెత్తిన ప్రశ్నలు..
ఆత్మహత్యకు ముందు జైపాల్ రెడ్డి

కాసాల జైపాల్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకుంటూ వ్యక్తిత్వ వికాసం పేరుతో ఇంపాక్ట్ ఆంశంను మన ముందు వదిలి వెళ్లాడు. సమస్య సున్నితంగా కనిపిస్తున్న లోతుగా ఆలోచిస్తే తెలంగాణ నిరుద్యోగ యువతకు జరిగే అన్యాయాన్ని లేవనెత్తాడు. అయినా.. ఈ ఆంశంపై ప్రభుత్వం స్పందన కరువు.

కాసాల జైపాల్ రెడ్డి వ్యక్తిత్వ వికాసం పేరుతో జరిగే అన్యాయంపై రాసిన లేఖ ఇదే..

తన స్వార్థం కోసం స్వయంగా నడిచే సేవ సంస్థలకు సైతం వాటి ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిన విషయం అందరూ జీర్ణించుకోలేక పోతున్నారు.

గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలోనే పల్లె పల్లెలో కడప కడపకు చేరడానికి సోషల్ మీడియా అయితే, దానికి ఈ క్రింద పోస్టర్ లో సూచించిన స్వయం ప్రతిపత్తి గల సేవ సంస్థలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ సహాయం, సహకారాన్ని అందించే సంస్థలను సైతం వదలలేదు మన గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు.

తన ఇంప్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే #ఉచిత_శిక్షణకు
ప్రత్యేకంగా తమ పాత్ర ప్రత్యక్షంగా , పరోక్షంగా పోషించడానికి కారణం గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు ఈ సంస్థల అధ్యక్షులను, పర్యవేక్షణ అధికారులను బతిమాలి, నమ్మించే ప్రయత్నం చేసి విజయవంతం అయ్యారు.

01) #రామకృష్ణ_మఠం-హైదరాబాద్.

అసలు ఇంప్యాక్ట్ సంస్థ యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం కావడానికి రామకృష్ణ మఠం హైదరాబాద్.
2012 సంవత్సరం తర్వాత రామకృష్ణ మఠం వారు అనుమతి ఇవ్వకపోయినా
బోధమయనంద స్వామి గారిని మాత్రం వదులుకొక ఇప్పటికీ స్వామిని పిలిచి ప్రసంగాన్ని ఇప్పించడం గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారికి వెన్నతో పెట్టిన విద్య.

02) #ఆధ్యాత్మికం

బ్రహ్మశ్రీ గౌరవ చాగంటి కోటేశ్వరరావు గారు, భారతీయం సత్యవాణీ గారు లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక రంగంలో పేరుగాంచిన వారిని ఇప్పటికీ గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ ఆహ్వానించడం వెనక రహస్యం
ఒక్కసారిగా ఇంప్యాక్ట్ సంస్థ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంటింటికి చేరడానికి సంపూర్ణంగా హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది.

03) #గౌరవఅప్పలప్రసాద్

విద్యార్థులు, యువతను ఆకర్షించేందుకు
తగిన జాగ్రత్తలు తీసుకుని గౌరవ అప్పల ప్రసాద్ జీ గారిని ఇంప్యాక్ట్ వేదికలకు పిలవడంతో. తాను ఇచ్చిన ప్రసంగం యూట్యూబ్ లో ఆప్లోడ్ చేయడమే కాకుండా.
30 సెకండ్లు‌‌, ఒకటి రెండు నిమిషాల నిడివి గల వీడియోలు Whatsapp లో వైరల్ చేయడంతో
భజరంగ్ దళ్, ABVP , విశ్వహిందూ పరిషత్ సభ్యులు పల్లెల్లో ఇంప్యాక్ట్ ను నమ్మడం ప్రారంభించారు.

జై హింద్ జై భారత్

వందేమాతరం నినాదాలకు చక్కగా సరిపోయింది. హిందూ బంధువులకు తెలియక చాలామంది యువత “#రెండు_రోజుల శిక్షణకు” TTTWS రావడం ఎక్కువైందంటే నమ్మండి.
ఇదే విషయాన్ని అందులో శిక్షణ తీసుకున్న చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకులు చెప్పారు.
( అసలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న RSS సంఘ్ పరివార్ గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ పైన కోపంతో ఉన్నారు).

04) #Junior_Chamber_International

JCI లో చేరిన సభ్యులకు ఇచ్చే విభిన్న రకాల శిక్షణను అచ్చం అచ్చుగుద్దినట్లు
ఇంప్యాక్ట్ లో కూడా అదే వాతావరణం ఉంటుంది.
మరోక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే
ఇంప్యాక్ట్ హైదరాబాద్ లో ఒక హోటల్ లో నిర్వహించే రెండు రోజుల శిక్షణ కోసం వచ్చిన వారిని సైతం ప్రేరణ చేస్తూ ప్రోత్సహిస్తూ
చివరకు JCI లో సభ్యత్వం తీసుకునేలా చేయడం జరుగుతుంది.
మీరు పరిశీలించి చూస్తే ఇంప్యాక్ట్ లో ఉండే యువత దాదాపుగా ఒక 100 మందికి పైగా JCI లో ఉంటారు.
JCI లో ఉండేవారు కనీసం ఇరవై శాతం ప్రముఖులు మరీ ముఖ్యంగా వ్యాపారస్థులు ఉంటారు.
JCI లో ఉన్న బిజినెస్ మెన్స్ ను తీసుకుని వచ్చి ఇంప్యాక్ట్ లో ప్రసంగాలు ఇప్పించడమే గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారి లక్ష్యం.

05) #LIONS_CLUB_INTERNATIONAL

గౌరవ గంపా నాగేశ్వరరావు స్వతహాగా లయన్స్ క్లబ్ లో మెంబర్ ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 316 F, 320 C, 320D లాంటి లయన్స్ క్లబ్ లలో గెస్ట్ లెక్చరర్ లు పెద్దమొత్తంలో ఇవ్వడంతో
కామారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఇంప్యాక్ట్ ఏర్పాటు చేసిన వేదిక కోసం వారి Sponsorship కచ్చితంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లయన్స్ మెంబర్స్ ఉండటంతో ఇంప్యాక్ట్ సంస్థను విస్తరించేందుకు చాలా సులభమైన మార్గం.

06) #ఆర్యవైశ్య_సంఘం

ఆర్యవైశ్య సంఘంలో ఉండే చాలామంది లయన్స్ క్లబ్ లో ఉండటం వల్ల గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు వారితో ఇంప్యాక్ట్ సంస్థను ప్రజల్లోకి అతితక్కువ సమయంలో చేరవేసి సక్సెస్ అయ్యారు.
#ఉదాహరణకు:
ఇంతకుముందు 316F కాస్త ఇప్పుడు 320D అయ్యింది. మెదక్, నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో లయన్స్ గవర్నర్ కాస్త నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారస్థులు ఆర్యవైశ్య సామాజిక వర్గం అవ్వడంతో
గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు ఆ 316F మొత్తం లయన్స్ క్లబ్ లకు అతిథిగా వెళ్లి పాల్గొన్నారు.

మీరు ఇంప్యాక్ట్ లో గమనిస్తే చాలామంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశాలు పుష్కలంగా ఇస్తుంటారు. ఉదాహరణకు మహేష్ గుప్తా (రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు), లాబిశెట్టి మహేష్ నిజామాబాద్

NOTE:
కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నల్గొండ వంటి ప్రాంతాల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు చేసే అబద్ధపు, అవసరం ఉన్నప్పుడు తీయ్యగా మాట్లాడుతూ అవసరం తీరిన తర్వాత పట్టించుకోకుండా ఉండే ప్రవర్తన వల్ల దూరంగా ఉంచుతారు. ఈ విషయాన్ని నేను కలిసిన సందర్భంలో వారు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు నా(కాసాల జైపాల్ రెడ్డి) తరపున విజ్ఞప్తి. ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్ధేశ్యం నాకు లేదు. ఏమి జరుగుతుందో అనే విషయం ప్రజలకు తెలియజేయడం కోసం మాత్రమే. దయచేసి అపార్థం చేసుకోవద్దని నా మనవి).

07) Life Insurance Corporation Of India.

LIC లో స్వయంగా గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు ఉద్యోగి కావడంతో
ఆ సంస్థలో ఉండే Officials తో ఇంప్యాక్ట్ వేదికపై ప్రసంగాలు ఇప్పిస్తుంటారు.
మీరు ఇంప్యాక్ట్ యూట్యూబ్ చానల్ గమనిస్తే గౌరవ శాస్తీ సార్ లాంటి ప్రముఖులు కనబడుతారు.

08) #ప్రభుత్వ_ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ లెక్చరర్ లు.

గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్ లు చేయడానికి గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ ఎనలేని కృషి చేస్తున్నారు. కారణం ఏమిటంటే, వారికి రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఉండటమే.
ఇక్కడ శిక్షణ తీసుకున్న వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడంతో వారు వివిధ రకాల ఉద్యోగ సంఘాల Whatsapp గ్రూప్ లలో ఈ సంస్థ సమాచారం చేరవేయడానికి సులభం అవుతుంది. అలాగే, క్రియాశీలక పాత్ర పోషించిన వారికి రెండు మూడు యూట్యూబ్ చానల్స్ లో మరియు ప్రముఖ టివి చానల్స్ ప్రోగ్రాంలకు ,ఇంటర్వ్యూలో అవకాశం ఇవ్వడం వల్ల వారు కూడా కొంచెం Fame కావడానికి మార్గాలు ఉన్నాయని చేరుతున్నారు.

ఇంప్యాక్ట్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో మీరు గమనిస్తే వీరు స్టేజ్ పైన తళుక్కున మెరిసి మురిసినారు.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
#ముఖ్యగమనిక: దయచేసి అర్థం చేసుకోవాలి. ఎంతమాత్రం అపార్థం చేసుకోవద్దు.
నాకు గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు
ఓ మంచి శ్రేయోభిలాషి.
ఈమధ్య సార్ సేవలను తప్పుదారి పట్టించి
మొత్తం రియల్ ఎస్టేట్ మరియు తన మిత్రులు తెలంగాణేతర ప్రాంతానికి చెందిన వారితో జతకట్టి కమర్షియల్ కోణంలో వెళ్తున్నారు. తనను కలిసి వివరించడం జరిగింది.
అయినా, గౌరవ గంపా నాగేశ్వరరావు సార్ గారు
మనసు మార్చుకోకపోవడంతో ఇలా ప్రజలకు ఆ సంస్థ ద్వారా జరుగుతున్న వ్యాపారం గురించి వివరించే ప్రయత్నం
చేస్తున్నాను.

కాసాల జైపాల్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking