Header Top logo

Suicide by writing a letter to the CM సీఎం కు లేఖ రాసి ఆత్మహత్య

Letter to the CM before committing suicide

వ్యక్తిత్వ వికాసం పేరుతో మోసం

– ఉచిత శిక్షణ పేరుతో మన వారికి అన్యాయం..

– ఆత్మహత్యకు ముందు సీఎం కు లేఖ రాసిన  కాసాల జైపాల్ రెడ్డి

– ప్రభుత్వం నుంచి స్పందన కరువు

కాసాల జైపాల్ రెడ్డి.. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఆత్మస్థార్యం కోల్పోయిన వారికి ధైర్యం చెప్పి వారి జీవితంలో కొత్త వెలుగులు వెలిగించే వారు. సోషల్ మీడియాలో ఎక్టీవ్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కానీ.. ఆతను కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో 24 జనవరి 2022 నాడు ఫేస్ బుక్ లో మూడు పోస్ట్ లు పెట్టాడు. ఆనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పెట్టిన పోస్ట్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వ్యక్తిత్వ వికాసం పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తున్న ఆంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట రాసిన లేఖ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని గంప నాగేశ్వర్ ఇంపక్ట్ పేరును సంబోంధిస్తూ రాసిన లేఖలు పట్టించుకోవడం లేదు. నిజానికి జైపాల్ రెడ్డి మరణం ఆత్మహత్య చుట్టూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.. కానీ.. అతను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో రెండు లేఖలపై విచారణ జరిపించాలని విద్యావంతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. Suicide by writing a letter to the CM

Questions on Impact

ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇదే..

ఉద్యమనేత ప్రియతమా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి నా విజ్ఞప్తి. దయచేసి మీరు మన #హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న పర్సనాలిటీ డెవలప్ మెంట్ (Personality Development Training Field) రంగంలో జరుగుతున్న తప్పులు, తప్పిదాలు, అవకాశాల వలతో అమాయక తెలంగాణ బిడ్డలను ఆగంజేస్తున్న వారిపై త్వరతగతిన #విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు.

నాకుఉన్నహక్కులు,#పరిమితులు

నేను ( కాసాల జైపాల్ రెడ్డి)చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోవడానికి నాకు ఎలాంటి హక్కులు లేవు. నాకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, హక్కులు, పరిమితులను దృష్టిలో పెట్టుకొని, సామాజిక బాధ్యత, కర్తవ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరూ బయపెట్టిన, బెదిరించినప్పటికీ ధైర్యంగా ఇదివరకే చాలా విషయాలు వెలుగులోకి తేవడం జరిగింది. Suicide by writing a letter to the CM

ఇక సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత బిడ్డగా మన తెలంగాణ రాష్ట్ర యువత భవిష్యత్ ఆగం కావద్దనే ఉద్ధేశ్యంతో మీ పర్యవేక్షణలో విచారణ, తగిన చర్యలు తీసుకోవాలని నా అభ్యర్థనను మీకు తెలియజేస్తున్నాను.

డబ్బులు సంపాదించాలనే యోచనలో

ఎలాగైనా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా మొదటగా ఉచతమనే ముసుగు తొడిగి అటు పిమ్మట కొందరు #కృత్రిమంగా శిక్షణను సృష్టించి తర్వాత మెల్లమెల్లగా నామమాత్రంగా ఫీజు రూపంలో డబ్బులు తీసుకుంటారు. ముఖ్యంగా మన తెలంగాణ పల్లె నిరుపేద బిడ్డల దగ్గర వేలకు వేల రూపాయలు వసూలు చేస్తూ వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మలచుకుని వారి పబ్బం గడుపుకుంటున్నారు. Suicide by writing a letter to the CM

ఉచితమంటే ఉత్సాహంగావస్తున్నారు

భూతల్లి పైన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉచితం అంటే చాలు చాలామంది జనాలు వెనకముందు మరో ఆలోచన లేకుండా తండోపతండాలుగా పరుగులు తీయడమే అవకాశవాదులకు లాభం అవుతుంది ( తప్పుగా అపార్థం చేసుకోవద్దు. కొన్ని విషయాల్లో మాత్రమే).

మరికొందరు ‘ఉచిత_శిక్షణ’ పేరుతో

ముఖ్యంగా గ్రామీణ తెలంగాణ విద్యార్థులు, యువత లక్ష్యంగా చేసుకుని తెలంగాణేతర ప్రాంతానికి చెందిన నిపుణులతో జతకట్టి మన బిడ్డలకు బండెడు అవకాశాలు ఆశజుపి అర్ధాంతరంగా చేతులు ఎత్తేసి ఆగంజేస్తున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా అభ్యర్థన. ఒకటి కాదు రెండు కాదు 2015 సంవత్సరం మొదలై ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి
వీరి ఆగడాలకు హద్దు ఆదుపు లేకుండా పోతుంది.

రోజు రోజుకు విభిన్న కోణాల్లో యువతకు #బంగారు_భవిష్యత్ ఉంటుందని భ్రమలు కల్పిస్తూ అప్పులపాలు జేస్తు
అటు ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా , ఇటు అమూల్యమైన భవిష్యత్ ను సైతం రెంటికీ చెడ్డ రేవడి లాగా ఆగమ్యగోచరంగా తయారు జేస్తున్నారు.

అసలు ఎవరూ అర్హులు

వాస్తవానికి ఈ ట్రైనింగ్ రంగంలో అసలు ఎవరూ అర్హులు అనే విషయమే మరిచిపోయి కొందరు శృతి మించి విద్యార్థులను,యువతను నట్టేట ముంచుతున్నారు.  కొందరైతే అర్హతలేని Online లో NLP( Neuro Linguistic Programming) కోర్స్ చేసి Offline లో శిక్షణ ఇస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు. మన పట్నంలో కొందరు Fake NLP ట్రైనర్స్ ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదు. Suicide by writing a letter to the CM

ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.
ఇకనైనా జప్పన ఆ సంస్థల పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నా మనవి.

ముఖ్యగమనిక: నాకు ఎవరి పైన కోపం లేదు, పగతో కక్షపూరీతంగా
ఇలా పోస్ట్ పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు.

ప్రజలకు నాణ్యమైన శిక్షణ అందాలి, మన తెలంగాణ బిడ్డలు సదా #సుభిక్షంగా ఉండాలనేదే నా ఆలోచన,
కోరుకుంటాను.

కాసాల జైపాల్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking