Header Top logo

Ilayaraja Memorial Conference

Ilayaraja Memorial Conference
ఇళయరాజా సంస్మరణ సభ

తాను నెరవేర్చాల్సిన
ఒక ప్రయోజనకరమైన పని కోసం
ఈలోకానికి వచ్చి
మరో కాలానికి నిచ్చెన వేసుకుని
వెళ్లిపోయిన గొప్ప భవిష్యత్తు ఉన్న మనిషి.

చేతిలోని కుంచెకి
మేధో వికాస బొమ్మల్ని ప్రాక్టీసు చేయించి
ఏదో మరింత ప్రయోజనకరమైన పని కోసం
హడావుడిగా వెళ్లిపోయిన తొందర మనిషి.

చూడాల్సిన ప్రపంచమంతా
పాతికేళ్ళకే చూసేసి
అలసిన కళ్ళతో
వెలుతురు లోకం వైపు తరలిన మనిషి.

విస్ఫారిత నేత్రాలకి
విశేషమిచ్చే వేలాది బొమ్మలిచ్చి
విసురుగా వెళ్ళిపోయిన విశేషమైన మనిషి.

ఒకటే పుట్టుక
ఒకటే జననం
ఎన్ని యోజనాల దుక్ఖమైనా
కొన్ని సామాజిక ప్రయోజనాల విస్మృత ప్రయాణం.

Young cartoonist Nakka Ilayaraja

సోదరుడా,
ఇళయరాజా… నీకు కన్నీటి నివాళి.

(జనవరి 26, ఉదయం 10గంటలకు ఒంగోలులో జరిగే సంస్మరణ సభలో పాల్గొనాల్సిందిగా
మిత్రులని కోరుతున్నాను)

రవి కుమార్ నూకతోటి

Leave A Reply

Your email address will not be published.

Breaking