Header Top logo

‘ నాగభైరవ కోటేశ్వర రావు’ సాహితీ పురస్కారాల ప్రదానం

వైభవంగా డాక్టర్ ‘ నాగభైరవ కోటేశ్వర

రావు’ సాహితీ పురస్కారాల ప్రదానం…!!

*గుండ్లకమ్మ చెప్పిన కావ్యం డాక్టర్
నాగభైరవ కోటేశ్వరరావు…!!

*తెలుగు సాహిత్య వినీలాకాశం……
కాలం వెంట నడిచిన కవి నాగభైరవ.!!

*నా పదాలు వేదాలు.. అందాలు అను
వాదాలు అనుభవాల నాదాలు…!!

డాక్టర్ నాగభైరవకోటేశ్వరరావు కవి మిత్రు
డని,ఆయన కవిత్వం పద్య, వచన, గేయ త్రివేణీసంగమమని వక్తలు కొనియాడారు.

ఈనెల22 సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిదేవాల
యంఅన్నమయ్య వేదికపై “డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పురస్కారాల ప్రదానం అత్యం
త వైభవంగా జరిగింది..2022 సంవత్సరానికి గాను డి.వి.ఎమ్ సత్యనారాయణ, 2023 కు గాను అబ్దుల్ రజాహుస్సేన్ పురస్కారాలను స్వీకరించారు.‌నాగభైరవ కోటేశ్వరరావు గారి శిష్యుడు డాక్టర్ భూసురుపల్లి వేంకటేశ్వర్లు తన గురువు గారి మీద ప్రేమతో,వారి పేరు మీద కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్ప కుండా సాహితీ వేత్తలకు ఈ పురస్కారాల్ని అందజేస్తున్నారు.!

ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖవైద్యు
లు, న్యాయవాది ,రచయిత ‘ జక్కంపూడి
సీతారామారావు అధ్యక్షత వహించారు…
ఈ సందర్భంగా ఆయన నాగభైరవ కోటేశ్వర
రావు వ్యక్తిత్వాన్ని, కవిత్వవైభవాన్ని కొనియా
డారు.‌నాగభైరవగారు కవిమిత్రుడు..ముఖ్యం
గాశిష్యవాత్సల్యం కలిగిన వాడు కనుకనే… భూసురుపల్లి వేంకటేశ్వర్లు గురువుమీద ప్రేమ
తో,గౌరవంతో సాహితీ వేత్తలకు ప్రతీ యేటా పురస్కారం అందజేస్తున్నారని చెప్పారు…

కవిగా నాగభైరవ ఎంతో ఉన్నతుడు,వ్యక్తిగా
సమున్నతుడని ప్రశంసించారు.నాగభైరవగారి గారి శిష్య వాత్సల్యం గురించి ఎంతైనా చెప్పొ
చ్చని,వర్ధమాన కవులను వెన్నుతట్టిప్రోత్సహిం
చడంలో దిట్ట ‘ అన్నారు..

“నా మెడిసిన్ పూర్తయ్యాక నాగభైరవ గారితో
పరిచయం ఏర్ప,రుచుకున్నా‌‌..అప్పుడాయన
చీరాలలో వుండేవారు.ఎంత నిగర్వో మాటల్లో
చెప్పలేనన్నారు.

నాగభైరవ గారు కాలం వెంట నడిచిన కవి.
కవిత్వంలో నిజాయితీ,నిబద్ధత కలిగిన కవి
అని ప్రశంసించారు.నాగభైరవ కవిత్వం జీవ
నది.శ్రీశ్రీ సామాజిక స్పృహ,జాషువా ధిక్కార
చైతన్యం,కవిరాజుగారిహేతుబద్ధత,తుమ్మలవారి నిబద్ధతను పుణికి పుచ్చుకొని,తన రచ
నల్లో ప్రతిఫలింప జేశారన్నారు‌.

నాగభైరవ గారు ఎప్పుడూ ఓ మాటంటుండే
వారు..” నా కవిత్వంలో ఎత్తులే తప్ప లోతు
ల్లేవు.ధర్మాలు తప్ప మర్మాలు లేవు.నిజాలు
తప్ప ఇజాలు లేవు” అన్న వారి మాటలు
అక్షరసత్యాలని సీతారామారావు అన్నారు..!!

ముఖ్య అతిథిగా హాజరైన ‘అరసం’జాతీయ కార్యదర్శి “పెనుగొండ లక్ష్మీనారాయణ”గారు
నాగ భైరవ కోటేశ్వరావు సాహితీ వైభవాన్ని
వేనోళ్ళ కొనియాడారు.‌ఆయన పద్యాన్ని ఎంతగా నో ప్రేమించేవారని, అలాగే వచనం,
గేయాన్ని కూడా సమంగా చూసేవారన్నారు.
పద్యం పాతబడిందని ఎవరైనా అంటే నాగ
భైరవ గారు నొచ్చుకునేవారని,పద్యం జీవనది
లాంటిది,అదెప్పుడూ పారుతూనే వుంటుం
దని చెప్పేవారన్నారు..నాగభైరవ రచనలు
కాలాతీత కాంతిరేఖలన్నారు.జాతీయత,
ప్రాంతీయత,లౌకికవాదం,సమైక్యత ఆయన
రచనల్లో అంతఃసూత్రంగా వుండేవని చెప్పా
రు.తెలుగు సాహిత్యంలో నాగభైరవ వినీలా
కాశంలో వెలిసిన సూర్యుడన్నారు.

నాగభైరవకు శిష్యులంటే అమితిష్టం..శిష్యుల
ఎదుగదలను చూసి మురిసిపోయేవారు‌‌.

“ఒక భూసురుపల్లి తన అనర్గళ ఉపన్యాసం
తో ఓలలాడించినప్పుడు,ఒక సుందర్రావు
(బీరం) సరికొత్త అభివ్యక్తీకరణలతో పద్యమై
ప్రవహించినప్పుడు,..నేను పసివాణ్ణయి.. పోతాను.నేను వెలిగించిన దీపాలకాంతిని
దోసిళ్ళలో తాగిళమురిసిపోతాను.వాళ్ళ వల్ల
నా గౌరవం పరిమళించింది.వాళ్ళు నా ఆస్తి..
నా గర్వం.అని ఒంగోలులో జరిగిన కనకాభి
షేకం సభలో నాగభైరవ చెప్పారు..!!.‌

నిజ జీవితంలో కళ్ళ ముందున్నవాటినే
కవితా వస్తువులుగా తీసుకునేవారు నాగభైభైరవ..

“నేను పల్లేటూరు నుండి బస్తీలవైపు
సాగివచ్చిన పైరగాలిని…..

పసితనంలో అమ్మపాడిన ఉయ్యాలపాటలు.

వెన్నెట్లో ఆరుబయట మంచంమీద కూర్చో
బెట్టుకొనితాత చెప్పిన కథలు…

బాల్యంలో విన్నహరికథలు,వీధినాటకాలు,
బుర్రకథలు..ఇవే నా కవిత్వానికి నేపథ్యాలు’
అ నాగభైరవ ఘనంగా చెప్పుకున్నారు.‌!
నాగభైరవ కవిత్వంలో అంతఃస్రవంతిగా సామాజిక చేతన ప్రవహించేదన్నారు..
పెనుగొండ..

“కులాలపేరుతో ఎన్నెన్ని
ఘోరకృత్యాలను జరుపుకున్నాం
మతాల మాటున ఎన్నెన్ని
మారణహోమం నెరుపుకున్నాం”

“నా దేశంలో రెండే రెండు రకాలు
ఒకటి చెమట ఓడ్చి బతికే రకం
రెండు చెమట ఊడ్చి గతికే రకం
అందుకే ఈ దేశంలో అనుక్షణం
అసమానతానరకం”..అనడం
నాగభైరవ కవికే సాధ్యమన్నారు పెనుగొండ.

ఇక జాతీయత,దేశమంటే వల్లమాలిన ప్రేమ..

“జాతీయత ఒక యజ్ఞం
దానిఫలం ఒక్కరమనే భావం
జాతీయత ఒక వేదం
సమైక్యత దాని నాదం”..అంటూ నాగభైరవ
జనానికి గొప్ప సందేశమిచ్చారని చెప్పారు.

“రేపు నువ్వూ,నేనూ వుండం.‌
అక్షరాలు అక్షయాలై
చిరంజీవులవుతాయి” ..

నాగభైరవగారు ,ఆయన కవిత్వం చిరంజీవు
లని పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు.!!

విశిష్ట అతిథి,సాహితీ వేత్త,నాగార్జున విశ్వ
విద్యలయ మాజీ రిజిస్ట్రార్ రావెల సాంబ
శివరావు మాట్లాడుతూ నాగభైరవ గారిని
తెలుగు పద్యకీర్తిగా అభివర్ణించారు. నాగ
భైరవ గారి పద్యం అనితర సాధ్యమన్నట్లు వుండేదన్నారు…రూపక రచనలో దిట్ట.పద్య
కవిత్వంలో మేటి,వచనకవిత్వంలో ఆయన
కు ఆయనే సాటి అన్నారు.వ్యక్తిగా ఎంత సౌమ్యుడో,కవిగా అంత మృదు స్వభావి అన్నారు.నాగభైరవ కవిగా ఒక ఎత్తు.ఎందరో
శిష్యులను అక్కునజేర్చుకొని,వారిని కవులు
గా మలచడం మరో ఎత్తన్నారు..ప్రత్యక్షంగా
నో,పరోక్షంగానోళ వేలాది మౌది కవులను
తయారుచేసొన ఘనత ఆయనదేనన్నారు.
భూసురుపల్లి వంటి శిష్యులుండటం నాగ
భైరవ అదృష్టమని చెప్పారు.గురువు మీది
ప్రేమతో ఇలా యేటా పురస్కారాల్ని అంద
జేస్తున్న భూసురుపల్లి వేంకటేశ్వర్లును ఆయ
న ప్రశంసలతో ముంచెత్తారు..!

ఆత్మీయ అతిథి గాడేపల్లి దివాకర్ దత్తు..
సభలో నాగభైరవ సాహితీ సేవలను కొని
యాడారు..నాగభైరవ గారు ఊరు గురించి
రాసినా,నదిగురించి రాసినా అందులో…
మానవ జీవన విధానం ప్రతిఫలించేదన్నారు.

“మా ఊరు దొడ్డది పశువులు వున్నాయిగా
మా ఊరు చెడ్డది మనుషులున్నారుగా.”.!

నాగభైరవగారు ఎర్రన పుట్టిన మట్టిలోనే
పుట్టారు.ఎర్రన నడిచిననేలలోనే నడిచి…
తన జన్మ ధన్యం చేసుకున్నారని చెప్పారు.
తెలుగులో తొలిపద్యం పుట్టిన సీమలో పద్య
కవిగా నాగభైరవ గారు పద్యానికి పట్టాభిషేకం
చేశారని చెప్పారు..కవిగా నాగభైరవ జీవనది
లాంటివారు..ఆయన కవితా ప్రవాహానికి తిరు
గుండేది కాదన్నారు..నాగభైరవ పద్యాన్ని
ప్రేమిస్తే..వచనాన్ని గుండెకు హత్తుకునే…
వారన్నారు‌.

“పద్దెము పాతవడ్డదని పల్వురు చెప్పిన
చెప్ప వచ్చు..తా

ముద్దుల మూటగట్టు. నవమోహిని ప్రేమకు
పాత యేమి?యే

హద్దులు లేని మాతృ హృదయంబున పొంగెడు ప్రేమ తత్వపున్

సద్దుకు పాతయేమి?

ఇవి చావని సత్యములీ వసుంధరన్ “!

ఇలా ….నాగభైరవ సాహితీ కృషిగురించి చెప్పాలంటే చాలానే వుంది.

*తిరముగా నిల్చియుండుట గిరికి సొగసు
నిలువకయ పారుచుండు నీటి సొగసు
ఆకుపచ్చదనము లయ్యడలి సొగసు
వీటినొకచోట గూర్చుట విధికి సొగసు”!!

“గూడులేని పక్షుల్ని గుండెల్లో దాచుకున్నందు
కే.‌.చెట్టుకీ,పిట్టకీ పొత్తు కుదిరింది.చెట్టు స్నేహ
మై వెలిగిపోయింది..” అనడం… నాగభైరవ
గారికే చెల్లిందని దత్తు ప్రశంసలతో ముంచె
త్తారు..!!

ఆత్మీయ అతిథి శెట్లం చంద్రమోహన్ మాట్లా
డుతూ నాగభైరవ గారి స్మృతి చిహ్నంగా సాహితీ పురస్కారాల్ని అందజేస్తుండటం భూసురుపల్లి వేంకటేశ్వర్లు విశాలహృదయా
నికి,గురు ప్రేమకు నిదర్శన మన్నారు.అద్దంకి సృజన సాహితీకి నాగభైరవ,భూసురు పల్లి సేవలను ఆయన కొనియాడారు..

భూసురుపల్లి కవిత్వం నదికిమల్లే విశాల
తత్వానికి ప్రతీక అన్నారు..

*ఒక నదిని ప్రేమించడమంటే
ఒకదేశాన్ని ప్రేమించడం
ఒక నదిని స్వీకరించడమంటే
ఒక నాగరికతను స్వీకరించడం”.

అనే వారని అన్నారు.భూసురపల్లి సంగీత,
సాహిత్యాల సమ్మేళనమంటూ దత్తు ప్రశంసల
తో ముంచెత్తారు..!

మరో ఆత్మీయ అతిథి కవి,రచయిత “మోదు
గుల రవికృష్ణ “మాట్లాడుతూ..నాగభైరవ
కోటేశ్వరరావు అభిరుచులనుప్రతిబింబిస్తున్న సాహితీ వేత్తలకు పురస్కారాల్ని అందజేయ
డం ముదావహమన్నారు..భూసురుపల్లి గురు
భక్తి సాటిలేనిదని ఈ పురస్కారాలేచెబుతు
న్నా యన్నారు.

పురస్కారాల కర్త,డాక్టర్ భూసురుపల్లి మాట్లా
డుతూ..నాగభైరవ గారి వంటి గురువు దొరక
డం తన పూర్వజన్మ సుకృతమన్నారు.తనకు
కవిత్వభిక్ష పెట్టిన దైవం నాగభైరవగారని,వారి
గౌరవార్ధం పురస్కారాలివ్వడం తన ప్రివిలేజ్
గా భావిస్తున్నట్లుచెప్పారు.ప్రకాశం జిల్లాలో
పద్య ప్రకాశానికి నాగభైరవగారి కృషి సాటి
లేనిదన్నారు‌..

తమకు జరిగిన సత్కారానికి పురస్కార గ్రహీ
తలు డివి ఎమ్ సత్యనారాయణ, అబ్దుల్
రజాహుస్సేన్ హృదయపూర్వక కృతజ్ఞతలు
తెలిపారు..నాగభైరవ సాహిత్య పురస్కారం పొందడం తమ సుకృతమని చెప్పారు.డాక్టర్ పాపినేని శివశంకర్, డాక్టర్ రావిరంగారావు,
కథారచయిత్రి స్వరాజ్య పద్మజ కుందుర్తి,..
ఖయాల్ సుభానీ,అశోక్ పారా తదితర సాహితీవేత్తలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమా
నికి హాజరయ్యారు…!!

సభ ఆద్యంతం నాగభైరవగారి సాహిత్య పరిమళంతో గుబాళించింది…!!

ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking