Header Top logo

రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభానికి సిద్ధం

  • 20 ఏళ్ల మచ్చా రామలింగారెడ్డి పోరాటం కృషి ఫలితం (APJDS)
  • నెరవేరనున్న అనంత జర్నలిస్టుల సొంతింటి కల
  • కోడిమిలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు

నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలోని కొడిమి గ్రామమునందు మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ నిర్మాణం పూర్తి కావస్తోంది ప్రారంభానికి సిద్ధమవుతోంది. పోరాటాల యోధుడు ఉద్యమాల రథసారథి మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (APJDS) 20 ఏళ్లుగా అనంతపురంలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేయాలని లక్షలాది రూపాయలు సొంత డబ్బు ఖర్చు కర్చుచేసి కోర్టు కేసులు, ఇతర అన్ని సమస్యలను పరిష్కరించారు. జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేర్చాలి పోరాడిన విషయం అందరికీ తెలిసిందే.

20 ఏళ్ల మచ్చా రామలింగారెడ్డి పోరాట, కృషి ఫలితంగా అనంతపురం నగరంలోని జర్నలిస్టులు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది.  RDT మాంచో ఫెర్రర్ సహకారంతో అనంతపురం నగరంలోని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభానికి సిద్ధమవుతోంది ఇంటర్నల్ రోడ్డు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గౌరవనీయులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద సెప్టెంబర్ 4న 5 వేల మొక్కలు నాటే కార్యక్రమం వైయస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైయస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమంలో జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.

ANDHRA PRADESH JOURNALIST DEVELOPMENT SOCIETY, (APJDS) ANANTAPURAMU DIST UNIT

Leave A Reply

Your email address will not be published.

Breaking