Header Top logo

హైదరాబాదులో హల్ చల్ చేస్తున్న మందు బేబీలు… యువకులపై దాడి

  • చైతన్యపురిలో మద్యం మత్తులో యువతుల వీరంగం
  • మద్యం షాపు వద్దకు వచ్చేవారిపై దాడులు
  • దారినపోయే వాళ్ల వద్ద డబ్బులు లాక్కుంటున్న వైనం

హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని చైతన్యపురి నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. అయితే చైతన్యపురిలోని ఓ వైన్ షాపు వద్ద నిత్యం తిష్ట వేస్తున్న కొందరు యువతులు మద్యం మత్తులో దారినిపోయే వారిపై దాడులు చేస్తూ సమస్యాత్మకంగా తయారయ్యారు. రోజూ మద్యం తాగడం, మద్యం లేకపోతే వైట్నర్ పీల్చడం… ఆ నిషాలో మద్యం దుకాణం వద్దకు వచ్చేవారిపై దాడులకు దిగడం, దారినపోయే వాళ్ల వద్ద డబ్బులు లాగేసుకోవడం… ఇదీ వారి దినచర్య.

ఈ మందు బేబీలను చూసి స్థానికులే భయపడుతుంటారంటే కొత్త వాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. రాత్రివేళల్లో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ యువకుడి బట్టలూడదీసి మరీ డబ్బులు లాక్కోవడంతో వీరంటేనే హడలిపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking