Header Top logo

కాసుల ధీరాజ శర్మ కవిత్వం – ప్రాణ పాత్ర!!!

ప్రాణ పాత్ర!!!

ఓ కుండా!!
నిన్ను తెలుసుకోకుండానే
ఉండి పోయాము ఇన్నాళ్ళు!!
ఇప్పుడు
మాకు తెలిసొచ్చింది
నీరు కూడా
నీవు లేకుండా నిలువ లేదని
నీ విలువ
వెలకట్ట లేనిదని
నెల నెలా కరెంటు బిల్లు
కట్టినప్పుడల్లా
నీ వేమిటో నీ విలువేమిటో
మాకు సంపూర్తిగా తెలిసొచ్చింది
ఫ్రిడ్జ్ పుణ్యమాయని!!


ఓ నీటి కుండా
నీవు మా ఇంట ఉంటే
నీరు తీయ కుండ
నీరు నింప కుండ
నిన్ను పిలువ కుండ
ఉండ లేము!

ఓ నిండు కుండా
నీవు లేకున్నచో
కొన కుండ ఉండలేము
మిన్న కుండ ఉండ లేము!

ఎందుకో తెలుసా
నీకు ఒక్క చిన్న రంధ్ర మైతె
నీటి ధార ఆగ కుండ
నిలువ నీరు వెడల కుండ
ఆప లేము!

నీకు ఒక నీటి బొట్టు ఎక్కువైతే
పొంగి పొరల కుండ
నిన్ను చూడ కుండ
వచ్చిన దారిలో పోకుండ
ఇచ్చినమాట మరువ కుండ
కుండ నామ స్మరణ
చేయ కుండ ఉండలేము!

ఉండిపో మా ఇంట
మేమున్నంత కాలం!!

అందుకే నిన్ను అలనాటి నుండి
ఇంటలో పూజిస్తున్నారు మా పెద్దలు
నీ లాగా నిండు కుండలా
ఉండమన్నారు
ఉన్న కొన్నాళ్ళైనా
సాయపడుతూ బ్రతకమన్నారు
ప్రాణ పాత్ర దాతవై!!!

– కాసుల ధీరాజ శర్మ
విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్
తూప్రాన్, మెదక్ జిల్లా.
9440523864.

Leave A Reply

Your email address will not be published.

Breaking