Header Top logo

పెర్కిట్ లో మెగా హెల్త్ క్యాంపు సక్సెస్

చేయూత స్వచ్ఛంద సంస్థ

ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

– 35 మంది వైద్యుల బృందంచే ఉచిత వైద్యం

– 42వ మెగా క్యాంప్ – మెగా క్యాంపు సద్వినియోగం చేసుకున్న ప్రజలు

  • మానవ సేవా – మాధవ సేవా డాక్టర్ మధుశేఖర్

మానవ సేవాయే మాధవ సేవా.. ఈ సామెతను నిజం చేస్తున్నారు డాక్టర్ మధు శేఖర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో 35 మంది వైద్యులు పాల్గొని వందల మందికి చికిత్స అందించారు. వైద్యం కోసం కిక్కిరిసిన జనంతో ఆ హెల్త్ క్యాంపు నిండి పోయింది.

చేయూత స్వచ్ఛంద సంస్థ

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పరిచయమైన పేరు. భీమ్ గల్ కు చెందిన డాక్టర్ మధు శేఖర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఇరువై ఏళ్ల క్రితం చేయూత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో సేవాగుణం గల జర్నలిస్ట్ లు.. న్యాయవాదులు.. ఉపాధ్యాయులు.. పొలిటికల్ లీడర్స్.. వాలంటీరులు ఇలా అందరిని ఈ సంస్థలో సభ్యులుగా చేర్చి నిజామాబాద్ జిల్లా ప్రజలకు వైద్యసేవాలందిస్తున్నారు డాక్టర్ మధు శేఖర్.

స్కూల్ గదిని ఆపరేషన్ థియేటర్ గా..

ఔను.. మీరు చదివింది నిజమే.. ప్రజల వద్దకు పాలనలా.. డాక్టర్ మధుశేఖర్ రోగుల వద్దకే వైద్యం అనే నానుడితో గ్రామాలలో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. హెర్నియా, మొర్రి లాంటి శస్త్ర చికిత్సలను ఆ ఊళ్లోనే చేస్తున్నారు.  స్కూల్ గదిని థియేటర్ గా మార్చి సెప్టిక్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని పేదలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. ఇగో పెర్కిట్ లో 42వ మెగా హెల్త్ క్యాంపు.

వైద్యుల బృందంకు డప్పులతో స్వాగతం..

చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవాలందించడానికి వచ్చిన వైద్యులకు పూల దండాలు వేసి పెర్కిట్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పులతో ఆ హెల్త్ క్యాంపు వద్దకు తీసుకెళ్లారు. విద్యార్థులు స్కూల్ అవరణలోకి రాగానే వైద్యులపై పూల వర్షం కురిపిస్తూ మార్చ్ పాస్ట్ చేస్తూ వెల్ కమ్ చెప్పారు. అనంతరం మెగ హెల్త్ క్యాంపును జ్యోతి వెలిగించి ప్రారంభిాంచారు వైద్యులు.

స్పెషాలిస్ట్ డాక్టర్ లతో ఉచిత వైద్యం..

పెర్కిట్ స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహిాంచిన మెగ హెల్త్ క్యాంపులో వందలాది మంది రోగులు వైద్యం కోసం రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. ఒక్కో వైద్యుడి వద్దకు లైన్ లో వెళ్లి వైద్యం చేయించుకున్నారు. వైద్యంతో పాటు ఇక్కడికి వచ్చిన రోగులకు మెడిసన్స్ కూడా ఫ్రిగా ఇచ్చారు.

డాక్టర్ మధు శేఖర్..

పసి పాపలకు జన్మనిచ్చేది తల్లైతే పునర్జాన్మ ఇచ్చేది మాత్రం వైద్యులన్నారు చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బి. మధుశేఖర్. పల్లెటూర్ లో పుట్టిన తాను పేదలకు వైద్య సేవాలందించాలని ఆర్మూర్ లో ఎం.జె. హాస్పిటల్ పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇరువై ఏళ్ల క్రితం పేదలు డబ్బులు లేక వైద్యం కోసం పడుతున్న బాధలను చూసి చేయూత స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఆయన. కరోనా కాలంలో ప్రజలంతా ప్రాణ భయంతో ఇంట్లో కూర్చుంటే ప్రాణాలకు తెగించి వైద్య సేవాలందించి వైద్యులు ప్రజలకు పునర్జాన్మను ఇచ్చారని గుర్తు చేశారు డాక్టర్ మధుశేఖర్.

వైద్యులకు సన్మానం ..

పేదలకు వైద్య సేవాలందించిన వైద్యులకు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాలువ కప్పి సన్మానం చేశారు. డాక్టర్ మధుశేఖర్ ను ప్రత్యేకంగా సన్మానించారు.

  • వయ్యామ్మెస్

Leave A Reply

Your email address will not be published.

Breaking