Header Top logo

ప్రజలు ధైర్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసిన – జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు

ఫిబ్రవరి 6, అనంతపురము

స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

వ్యాక్సినేషన్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోవిడ్ ను అరికట్టేందుకు ఫ్రంట్ లైన్ లో పని చేసిన రెవెన్యూ , పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వారితో పాటు వ్యాక్సిన్ వేయించుకున్నానన్నారు. ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడం కోసం. తాను ముందుగానే వ్యాక్సిన్ వేయించునున్నానన్నారు. జిల్లా ప్రజలంతా భయాలు, అపోహలు వదిలి వేసి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 10 నెలల పాట కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియతో కోవిడ్ ను అంతమొందించడంలో ఆఖరి ఘట్టానికి చేరుకున్నామన్నారు. ప్రజలు సహకరించి స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ కు ముందుకు రావాలన్నారు.

ఇప్పటి వరకూ 29,241 మంది హెల్త్ కేర్ వర్కర్లకు గానూ 13,075 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. 43,871 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లలో 3113 మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వ్యాక్సినేషన్ అనంతరం అర గంట పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. పర్యవేక్షణలో ఉన్న సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా ఫైళ్లు చూస్తూ, అధికారిక కార్యకలాపాలు చేపట్టారు.జిల్లా కలెక్టరుతో పాటు అసిస్టెంట్ కలెక్టరు సూర్య కూడ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking