Header Top logo

Some characters will be with us forever పాత్రలు మన వెంటే ఉంటాయి

Some characters will be with us forever

సినిీమాలలో కొన్ని పాత్రలు మన వెంటే ఉంటాయి

#nedumudivenu కొంత మంది గొప్ప నటులు మన మధ్య లేకపోయినా.. వారు పోషించిన విభిన్న కొన్ని పాత్రలు మన వెంటే ఉంటాయి. #భారతీయుడు  సినిమాలో సిన్సియర్ పోలీస్ పాత్ర  అంటే  ఎత్తు, కాస్త కండలు కలిగిన శరీరం ఉండాలి అనే రూల్ ని బ్రేక్ చేసిన వ్యక్తి nedumudivenu గారు.  వరుస హత్యలు చేసే ఒక ముసలి వాణ్ణి పట్టుకునే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓ మోస్తరు ఎత్తుగా, బక్కపలుచగా వుండే ఈయన. తన అద్భుతమైన నటనతో తన శరీరపు లోపాన్ని కనిపించకుండా చేసారు. కొన్ని సన్నివేశాలలో కమల్ తో పోటా పోటీగా నటించారు. ( ముసలి వాడైన  హంతకుణ్ణి పట్టుకునే పోలీస్ కూడా ఓ రకంగా ముసలి వాడిగా, రిటైర్ అవ్వటానికి సిద్ధంగా వున్నవాడిని తీసుకుంటేనే సినిమా రక్తి కడుతుందని అనుకున్నారేమో అది వేరే విషయం )

nedumudivenu3

#అపరిచుతుడు సినిమాలో  నీతి, న్యాయం, ధర్మం ఇప్పటి సమాజం లో లేవనీ , నువ్వు న్యాయం కోసం ఎంత పోరాడినా వృధా అని కొడుకుకి చెప్పే సామాన్య మధ్య తరగతి తండ్రి పాత్రలో గొప్ప నటన కనబరిచారు nedumudivenu. కన్న కూతురు  చావుకి కొంత మంది బాధ్యతా రాహిత్యం కారణం అనీ, కోర్ట్ లో వాదించే అమాయకపు, అర్ధం లేని కోపపు పాత్రలో, ఆ చావుకీ  పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కారణ భూతులైన కొంత మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవ్వరికీ  శిక్ష విధించలేక పోయామనే అసమర్దుని  న్యాయ వాదిగా  ఆయన నటన అనితర సాధ్యం.

#aanumpennum లో ఇద్దరి ప్రేమికుల సంతోషకరమైన సంగమం తరువాత ప్రేమికుడి లోని  భయానికి , ఏడుపుకి , పిరికితనానికి, అలాగే ప్రేమికురాలు లోని తెగింపుకి, ధైర్యానికి  కారణభూతుడు అవుతాడు nedumudivenu గారు.  సమస్య వస్తే మగవాడికంటే ఆడవారే దృఢంగా ఎదురుకుంటారనే విషయాన్నీ ఆయన, ప్రేమికుల  వస్త్రాలని  దొంగతనం చేయటం వల్లనే మనకి అర్థమవుతుంది.

మలయాళం, తమిళ్ మరియు వివిధ భాషల్లో ఎన్నో సినిమాలలో  nedumudivenu నటించినప్పటికీ నేను ఈ పై సినిమలలో మాత్రమే ఆయనని చూసాను.  అతని నటనని ఆస్వాదించాను. అతను ఇప్పుడు మన మధ్య లేక పోయినా.. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ  సెలవు 🙏

M. Rk

M. Rk

Leave A Reply

Your email address will not be published.

Breaking