AP 39TV 20 ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా కనేకల్లులో ఎస్సై దిలీప్ కుమార్ ముస్లిం మత పెద్దలు, మసీదు ముతవల్లీలతో సమావేశం నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నమాజ్ కోసం మసీదు కు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని,శానిటైజర్ లేదా సబ్బులతో చేతులు శుభ్రపరుచుకొన్న తర్వాతే మసీదు లోపలికి అనుమతించాలని, మసీదు లోపల ప్రార్థన చేసేందుకు సర్కిల్ రౌండ్ గీయాలని, వాటిలోనే ప్రార్థన చేస్తూ సామాజిక దూరం పాటించాలని, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సామాజిక దూరం పాటిస్తూ బయటకు వెళ్ళేవిధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.