ఫీఎఫ్ఐ తీవ్రవాద సంస్థ పునాదిని పెకిలించడానికి
ఎన్ఐఎ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది.
దేశ వ్యాప్తంగా ఫీఎఫ్ఐ తీవ్రవాద కార్యకలపాలతో హింసత్మక సంఘటనలకు పాల్పడటానికి వ్యూహం రూపొందించింది. కేంద్ర నిఘా వర్గాల ముందు జాగ్రత్తతో దేశ వ్యాప్తంగా సినీ పక్కిలో దాడులు చేసి పలువురిని అరెస్టు చేసింది.
శుక్రవారం విచారణ చేసిన ఎన్ఐఎ అధికారులు పీఎఫ్‌ఐ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసారు. మొత్తం 11 మందిపై హైదరాబాద్ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది.
నిజామాబాద్‌లో జులై 4న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదైంది. పీఎఫ్‌ఐ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖాదర్ సహా 11 మందిని అరెస్టు చేశారు. నిందితులపై 120బి, 153ఎ, ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.