Mother song అమ్మ ప్రేమే.. ఈ పాట
Mother song
అమ్మ ప్రేమే.. ఈ పాట
సాకి: అమ్మా అమ్మా.. నీవె మా బ్రహ్మా
అమ్మా అమ్మా.. నీవె మా బ్రహ్మా
పల్లవి: అమ్మజోల పాడితే హాయిగుంటది
అమ్మపాట వింటె ఎంతొ కమ్మగుంటది
అమ్మగొంతులోన అమృతం ఉన్నది
అనంతకోటి పుాజలతో ఆయుష్షు కోరుకుంటది
జో..లాలి.. జొజో..లాలి..! జో..లాలి.. జొజో..లాలి.!!
చరణం: ఉగ్గుపాలతోనే అమ్మ బుద్దులెన్నో నేర్పిస్తది
బుద్దిగ వినుకుంటు మనం కేరింతలు కొడతాము
సంగీత సాధనలేమి చేయలేదు అమ్మ
మనకోసం సంగీత సరస్వతిగా
మారుతుంది అమ్మ… ॥అమ్మజోల॥ Mother song
జోలపాటలొ మంచి భవిష్యత్తును కోరుతుంది
అమ్మతెలుసుకొని మసలుకుంటే నీవె ఒక బ్రహ్మ
అమ్మపాటలోన ఎంతొ అర్దముందిరా
తెలుసుకుంటె బ్రహ్మాండమంత తత్వముందిరా.. ॥అమ్మజోల॥
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని బోధించే ఆదిగురువు అమ్మ..
నాన్ననే మెప్పించి మన కోరికలు తీర్చు కల్పవల్లి అమ్మ
కన్పించే దేవతలె మన అమ్మానాన్న
మరువక మనసారా ప్రేమించర కన్నా..
అమ్మనాన్నలకు ప్రేమ తో..
నాగభూషణం పరికె
డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు
9492312233