Header Top logo

MLA Kidnapped By Naxals -06 నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే

కిడ్నాప్

MLA Kidnapped By Naxals -06

మ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్

మాక్లూర్ మండం డికంపల్లి గ్రామంలో అల్లూరి సీతారామారాజు.. సుభాస్ చంద్రబోసు.. మహాత్మగాంధీ విగ్రహాలను ఆవిష్కరణ సందర్భంగా నేను తీసుకున్న నిర్ణయం జీవితాంతం గుర్తుంటుంది.

ఆ ముగ్గురు మహానీయుల మార్గాలు వేరైనా..

ఉన్నత లక్ష్యం కోసం.. పేదల అభ్యున్నతి కోసం.. దోపీడి లేని వ్యవస్థ కోసం పోరాడిన వీరులు.

సీతారామారాజు.. దేశ స్వాతంత్య్రం కోసం అడవిలో ఉంటూ ఆయుధాతో పోరాటాు చేసాడు..

మహాత్మగాంధీ.. అహింస మార్గంలో సత్యగ్రహం చేస్తూ బ్రిటీష్ వారితో పోరాటాలు చేసి స్వాతంత్య్రం సాధించాడు..

సుభాష్ చంద్రబోసు.. మొక్కవోని ధైర్యంతో స్వాతంత్య్రం కోసం ఆర్మీ తయారు చేసి యుద్దాలు చేసాడు.

వీరు ముగ్గురు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులే…

దోపీడి లేని సమాజం రావాలని ఆశించిన వారే..

ఆ ముగ్గురి గురించి బాగా ఆలోచించాను.

MLA Kidnapped By Naxals -06 ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్

అల్లూరి సీతారామారాజు..

ఆ మహీనీయుడిని ఆధర్శంగా తీసుకుని ఆయుధాలతో పోరాటం చేయలేను. ఒకవేళ అలా పోరాటం చేస్తే.. నన్ను నక్సలైట్ లాగానే ప్రభుత్వం ఎన్ కౌంటర్ పేరిట కాల్చి చంపొచ్చు.

మహాత్మగాంధీ..

అహింస.. అహింస అంటూ ఉద్యమాలు చేసిన గొప్ప వ్యక్తి.. కానీ.. అతని పేరు చివర ఉన్న గాంధీ పేరు.. గాంధీ పేరు గల టోపితో రాజకీయాలు చేస్తూ పేదలకు సేవా చేస్తున్నామని సేవ్ చేస్తున్నా వారిలా నేను చేయలేను.

సుభాష్ చంద్రబోసు..

బ్రిటీష్ పాలకులను పారదోడానికి ఆనాటి నాయకులతో విభేదించి సైన్యం తయారు చేసి పోరాటాలు చేసాడు. బతికినన్నీ రోజులు వీరుడిలా పోరాడాడు. ఎవరికి తవంచకుండా బతికాడు.

ఈ ముగ్గురిలో సుభాష్ చంద్రబోసు పంథా నాకు నచ్చింది.

ఎప్పుడు చట్టానికి లోబడి వ్యవహరించలనుకున్నాను.

బతికినన్ని రోజులు ఒకరు వేలేత్తి చూపకుండా బతుకాలని నిర్ణయించుకున్నాను.

కాల చక్రం గిర్రున తిరుగుతుంది..

ఒకటి.. రెండు.. మూడు.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా గడిచి పోయింది..

1989లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ చాలా మంది టిక్కెట్లను మార్చినా.. డిచ్పల్లి నియోజక వర్గం టిక్కెట్ నాకే ఇచ్చింది.

నియోజక వర్గ ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు..

ఆ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం నైతిక బాధ్యత అనుకున్నాను..

ప్రాజెక్ట్ రామడుగు గ్రామ ప్రజకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే నన్ను నక్సల్స్ కిడ్నాప్ చేసారు..

నిజానికి నక్సల్స్ నిస్వార్థంగా దోపీడి లేని వ్యవస్థ కావాలని ఉద్యమాలు చేస్తున్నారు..

నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం సాయుధ పోరాటం చేస్తున్నారు..

తుపాకి గొట్టం ద్వారానే విప్లవం సాధిస్తామనే నమ్మకంతో పోరాటం చేస్తున్నారు..
సమాజంలో విలువైనది ప్రాణం..

ఆ మలువైన ప్రాణాన్ని గడ్డి పోచతో సమానంగా భావించి పేదల కోసం ప్రాణ త్యాగం చేస్తున్నారు నక్పల్స్..

MLA Kidnapped By Naxals -06 ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్

నక్సల్స్ – పొలిటికల్ లీడర్లు..

వీరిద్దరు ప్రజల కోసమే పని చేస్తున్నామంటారు.. కానీ.. నిజానికి ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తున్న నక్సల్స్ త్యాగమే చాలా గొప్పది. మెజార్టీ పొలిటికల్ లీడరులు మాత్రం దేవుడి మీద ప్రమాణం చేసి అక్రమంగా డబ్బులు, ఆస్థులు సంపాదిస్తున్నారు. సమాజంలో ఎక్కడ చూసినా అవినీతే.. ఎమ్మెల్యేగా గెలిచినోళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఐదు తరాల వారసులు కూర్చుండి తిన్నా తరగని ఆస్తులు కూడ బెడుతున్నారు.

‘‘నేను.. నా కుటుంబం.. ఆ తరువాతనే ప్రజాసేవా’’ ఇదీ పొలిటికల్ లీడరు నీతి..

‘‘అవినీతి.. అక్రమాలు.. దోపిడి లేని వ్యవస్థ కోసం ఉద్యమాలు చేయడం’’ ఇది నక్సల్స్ నీతి.

ఆ నక్సల్స్ అన్నీ వదిలి ప్రజలను సాయుధ పోరాటానికి సిద్దం చేస్తున్న నిస్వార్థపయి వారు.

అందుకే ప్రజలు నక్సల్స్ కు అండగా నిలుస్తున్నారనుకున్నాను.

కానీ.. కొందరు నక్సల్స్ ముసుగులో బూర్జువ వర్గాల వలే తప్పులు చేసి ఉద్యమానికి చెడ్డ పేరు తెస్తున్నారు.

గ్రామ స్థాయిలో మిలిటెంట్ వ్యవస్థలో జరిగిన పొరపాటుల వల్ల ఉద్యమంపై చెడు ముద్ర పడుతుందనిపించింది.

అయినా.. ఆయుధాలు పట్టుకుని నక్సల్స్ పోరాటాలు చేయడం భారత రాజ్యాంగం ప్రకారం నేరం..

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటు వేసి గెలిసిన ప్రతినిధి రాజ్యానికి లోబడి పరిపాన చేయాలి.

చట్టానికి ఎవరూ చుట్టాలు కారు.. తప్పు చేసిన ప్రతి వ్యక్తిని శిక్షించే చట్టాలు మనకున్నాయి..

కానీ.. ఆ చట్టాలు అధికారం ఉన్న వారికి, పొలిటికల్ లీడరులకు చుట్టాలుగా మారి వంగీ సలాం చేస్తున్నాయి..

తప్పు చేసిన వారు కూడా సాక్ష్యం లేకుండా చేసి చట్టం నుంచి తప్పించుకుంటున్నాడు..

అదే నక్సల్స్ ప్రజల సమక్ష్యంలో ప్రజాకోర్టు నిర్వహించి తప్పు చేసినట్లు నిరూపించి శిక్షలు విధిస్తారు..

న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు.

ధనవంతుడైనా.. పేదోడైనా తప్పు చేస్తే చాలు.. శిక్ష అనుభవించాల్సిందే.

అందుకే నక్సల్స్ ఇలాకలో తప్పు చేయాలంటే భయపడుతారు జనం.

నక్సల్స్ తమకు పట్టున్న ప్రాంతాలలో పోటీ ప్రభుత్వం నిర్వహిస్తున్నారు.

నక్సల్స్ ఇలాకలో వారు చెప్పిందే వేదం.. వారు విదించిందే శిక్ష.

కానీ.. ప్రజాస్వామ్యంలోని న్యాయవ్యవస్థకు.. నక్సల్స్ వ్యవస్థకు మధ్య చాలా వ్యత్యాసనం ఉంది.

భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం కావాని కోర్టుకు వెళ్లితే చెప్పు అరిగి పోవాల్సిందే.

కొందరు అవినీతి న్యాయమూర్తుల వల్ల న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది.

డబ్బుతో ధనవంతులు న్యాయమూర్తులనే కొంటున్నారు.

కోట్లు కొల్లగొట్టిన ధనవంతులకు శిక్షలు పడవు.

కానీ.. పొట్ట కూటీ కోసం దొంగతనం చేస్తే వెంటనే శిక్షలు పడుతాయి.

కోర్టులలో న్యాయం చాలా విచిత్రంగా ఉంటుంది.

మున్సీఫ్ కోర్టు ఇచ్చిన తీర్పులో అన్యాయం జరిగిందని జిల్లా కోర్టుకు వెళ్లోచ్చు.

ఆ కోర్టులో అన్యాయం జరిగిందని హైకోర్టుకు వెళ్లోచ్చు. అక్కడ అన్యాయం జరిగిందని సుప్రీం కోర్టుకు వెళ్లోచ్చు. ఈ కోర్టు వ్యవహారమంతా డబ్బున్న ధనవంతుకు అనుకుంగా ఉంటాయి.

ప్రజాకోర్టులో విచారిస్తారు. తప్పు చేసినట్లు నిరూపణయితే శిక్ష అము చేస్తారు.

నక్సల్స్ తీర్పులో అన్యాయం జరిగితే.. ఎవరికి ఫిర్యాదు చేయరాదు.

ఒకవేళ తప్పుడు తీర్పు ఇచ్చామని భావిస్తే బహిరంగంగా క్షమాపణ కోరుతారు. ఆ తప్పును సరిదిద్దు కుంటారు. అయినా.. వ్యక్తి నిర్మూలన సమస్యలకు పరిష్కారం కాదనిపించింది.

ఇప్పుడు నేను చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తాదేమో…

ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నక్సల్స్ను జైల్ నుంచి రిలీజ్ చేస్తారా..?

ఒకవేళ రిలీజ్ చేయనట్లయితే..? నక్సల్స్ నన్ను కాల్చీ చంపడం ఖాయమా..?

(నక్సల్స్ చెరలో ఉన్న ఎమ్మెల్యే చావు తప్పదని మానసికంగా సిద్ద పడుతారా..? తప్పించుకుని పారి పోతారా..? రేపటి వరకు ఆగాల్సిందే..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking