Header Top logo

MLA Kidnapped By Naxals -03 నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-03

కిడ్నాప్..

ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్  -03

గౌరవనీయులైన కలెక్టర్ అజేంద్రపాల్ గారు..

పేద ప్రజల‌ కోసం ప్రాణాల‌ను ప్రాణంగా పెట్టి ఉద్యమాలు చేస్తున్న నక్సల్స్ ను పట్టుకుని ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ ల‌లో కాల్చీ వేస్తోంది. ప్రజా ఉద్యమాల‌ను నిర్వహించడంలో బాగంగా కొందరిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. అందుకు ప్రతి కారంగా డిచ్ ప‌ల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావును కిడ్నాప్ చేసాము.. మా సహచరులైన  నక్సలైట్లు చిన్నక్క, రాజక్క, పురుషోత్తంరెడ్డి, సంతోష్ రెడ్డిల‌ను 24 గంటల్లో విడుద చేస్తున్నట్లు రేడియోలో ప్రకటించనట్లయితే మా చెరలో ఉన్న ఎమ్మెల్యేకు మరణ శిక్ష విధిస్తాం.  పోలీసు గాలింపు చర్యలు చేపట్టే ముందు ఎమ్మెల్యే మా ఆధీనంలో ఉన్నాడనే విషయం మరిచి పోవద్దు..

ఇట్లు

ప్రసాద్, దళ కమాండర్,

సిర్నాపల్లి దళం,

నక్సల్స్ కూర్చున్న చోటికి కూడా  గ్రామస్తులు ఒక్కోక్కరు చాలా మంది చేరుకున్నారు.

‘‘దయచేసి ఎమ్మెల్యేను వదలండి..’’ నక్సల్స్ తో వాగ్వివాదానికి దిగారు కొందరు గ్రామస్తులు.. అదే సమయంలో కొందరు మహిళలు ధైర్యం చేసి నన్ను కిడ్నాప్ చేయడాన్ని వ్యతిరేకించారు.. ఇదే అదనుగా భావించిన టీడీపి కార్య‌క‌ర్త‌లు నక్సల్స్ ను  అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు.

ఆ సమయంలో గందర గోళ పరిస్థితి ఏర్పడింది.. ప్రజల‌ను భయ పెట్టడానికి దళ కమాండర్ ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకితో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. పొగ బాంబు విసిరి భయ పెట్టారు..

‘‘ముందుకు వస్తే కాల్చి పారేస్తాం..’’ హెచ్చరించారు నక్సల్స్..

నక్సలైట్ల హెచ్చరికల‌ను ఖాతరు చేయడం లేదు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు..

ఎలాగైన నక్సల్స్ చెర నుంచి ఎమ్మెల్యేను విడిపించాల‌ని ముందుకు వచ్చారు కొందరు. తెగింపుతో ముందుకు వస్తున్న లోకల్ టీడీపీ నాయకులు పల్లె రాజన్నపై కోపంతో తన వద్ద ఉన్న గొడ్డలి విసిరాడు ఓ దళ సభ్యుడు.. ఆ గొడ్డలి కాలు తొడకు తగిలి రక్తం ఉబికి వస్తోంది. ఆ రక్తంను చూడగానే మనస్సులోనే బాధ పడ్డాను. నా కోసం ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారనుకున్నాను. నక్సల్స్ చెర నుంచి నన్ను విడిపించడానికి ప్రాణాల‌కు తెగించిన ఆ కార్యకర్తను మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

‘‘దయచేసి మీరు తిరిగి వెళ్లి పొండి.. నేను తప్పు చేయలేదు.. నక్సల్స్ నన్నేమి చేయరు..’’ గ్రామస్థుకు రెండు చేతు జోడించి దండం పెట్టి వేడుకున్నాను.

‘‘మీరు సైలెన్స్ గా  మాతో రండీ.. ఇక్కడికి వచ్చిన వాళ్లంతా నీకోసం రాలేదు.. అందులో మా మిలిటెంట్లు ఉన్నారు.. ఏమి జరుగుతుందో చూడటానికి వచ్చిన జనం ఉన్నారు.. కొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.’’ హెచ్చరించాడు దళ కమాండర్ ప్రసాద్.

గ్రామస్థులు భయపడి అక్కడే నిల‌బడి పోయారు.. నేను నక్సల్స్ తో అడవిలో నడుస్తున్నాను.

ఆ అడవిలో ఈత చెట్లున్నాయి, పచ్చగా గుంపు గుంపులుగా పెరిగిన బుసా చెట్లున్నాయి. అక్కడక్కడ పసుపు రంగుతో కనిపిస్తున్న తంగేడి చెట్లున్నాయి.. ఎత్తుగా పెరిగిన  టేకు.. మొతుక చెట్లను దాటి అడవిలో నడుస్తున్నాము. పచ్చని గడ్డి పై నడిసి వెళుతుంటే ఒర్రె కనిపించింది. ఆ ఒర్రెలోని ఇసుకలో కూర్చున్నాము. సాయుధులైన ఇద్దరు దళ సభ్యులు సెంట్రీ డ్యూటీ చేస్తున్నారు.

‘‘నీవు నిజామాబాద్ వెళ్లి సాయంత్రం ఐదు గంటల‌ తరువాత ఈ లేఖను కలెక్టర్ కు  అంద చేయు..’’ ముందే కలెక్టర్ కు రాసిన లేఖను రఘువీరరెడ్డికి  అందచేసాడు దళ కమాండర్. ఆ లేఖను తీసుకుని రామడుగు గ్రామం వైపు నడుస్తున్నాడు అతను. ‘‘ జనం ఇక్కడికి కూడా వస్తున్నారు.. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లి పోవాలి..’’

దళ కమాండర్ ప్రసాద్ చెవిలో చెప్పాడు డిప్యూటీ దళ కమాండర్ కూర మల్ల‌న్న. ఆ తరువాత నక్సల్స్ తమ కిట్ బ్యాగ్ ల‌ను సర్దుకున్నారు. అక్కడ కూర్చున్నట్లు ఎలాంటి అనవాళ్లు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు వారు. MLA Kidnapped By Naxals -03

గుట్టలో.. చెట్ల మధ్య నుంచి నడిసి వెళుతుంటే..

‘‘ప్రభుత్వం షరతుల‌ను అంగీకరించక పోతే నిన్ను ఖతం చేస్తాం.’’  ఆ మాటలే గుర్తుకు వస్తున్నాయి.

నిజానికి నేను నక్సల్స్ కు వ్యతిరేకంగా ఎప్పుడు వ్యవహరించలేదు. పోలీసు`నక్సల్స్ మధ్యన ఇబ్బంది పడుతున్న ప్రజల‌కు సాధ్యమైనంతా సహాయం చేసాను. అయినా.. నక్సల్స్ తో శతృత్వం అసలే లేదు. అయినా.. వారి షరతుల‌ను నెరవేర్చు కోవడానికి నన్ను కిడ్నాప్ చేసారు నక్సల్స్. జైల్లో ఉన్న నక్సల్స్ ను ప్రభుత్వం విడుదల‌ చేయనట్లయితే నాకు మరణ శిక్ష విధిస్తారట.. నేను చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుందేమో అనుకున్నాను.

రెండు గంటలుగా నడుస్తూనే ఉన్నాము. కానీ.. ఆ నక్సల్స్ అల‌సినట్లుగా కనిపించడం లేదు. రోజు నడిసిన అల‌వాటు వారికుంది. ఆ నక్సల్స్ అడవులో ఉండి తమ కార్యకపాు నిర్వహిస్తుంటారు.

వారంతా యాక్టివ్ గా ఉన్నారు.. అలర్టుగా ఉన్నారు. నన్ను కిడ్నాప్ చేసామనే సంతోషంతో ఉన్నారు.

నన్ను నక్సల్స్ చెర నుంచి విడిపించడానికి పోలీసులు దాడులు చేస్తారనే భయం కూడా వారిలో లేదు.

కానీ.. ఏమి జరుగుతుందోననే భయం మాత్రం నాలో ఉంది.

(జైల్ లో ఉన్న న‌క్స‌ల్స్ ను ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తుందా..? న‌క్స‌ల్స్ చెర‌లో ఉన్న‌ ఎమ్మెల్చేకు మ‌ర‌ణ శిక్ష త‌ప్ప‌దా..?) MLA Kidnapped By Naxals -03

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking