ఏపీ39టీవీ న్యూస్ జూన్ 1
గుడిబండ :- మండలం పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం లో నివసిస్తున్న వడ్డే భీమప్ప కుమారుడు దేవరాజు ఇంట్లో నిత్యం ఉపయోగించే కట్టెలపొయ్యి లో మంటలు వ్యాపించి అక్కడే ఉన్న రాగులు వేరుశనగ అలసంద బియ్యం కందులు అగ్నికి ఆహుతి అయ్యాయి ఇంట్లో ఉన్న దేవరాజు అల్లుడు మదన్ మంటలు ఆర్పడానికి ప్రయత్నించి రెండు చేతులు చాలా దెబ్బతిన్నాయి విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు అతనిని కాపాడి 108 వాహనం ద్వారా మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు బాధితుడు జరిగిన నష్టాన్ని గుడిబండ తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ