Header Top logo

ఏపీ మాస్ సంస్థ తరఫున కోవిడ్-19 సహాయ కార్యక్రమాలు.

ఏపీ39టీవీ న్యూస్ జూన్

గుడిబండ:- మండలం నందు ఏపీ మా స్వచ్ఛంద సంస్థ తరఫున మందలపల్లి, ముత్తుకూరు, పి. సి గిరి గ్రామపంచాయతీ లోని పది గ్రామాలలో కోవిడ్ గురించి అవగాహన కార్యక్రమాలు, జాగృతి కార్యక్రమాలు నిర్వహించడమైనది. మండలంలో
కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తుల కుటుంబాలకు 100 ఇళ్లకు డ్రై రేషన్ కిట్స్ మరియు పండ్లను ఉచితంగా పంపిణీ చేయడమైనది. ఈ పంపిణీ కార్యక్రమంలో గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్, మందలపల్లి సర్పంచ్ అశ్వర్థ, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. దీనితోపాటు 2500 మాస్కులు 700 శానిటైజర్ గ్రామస్థులకు పంపిణీ చేయడమైనది. గుడిబండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు 5 పల్స్ ఆక్సీ మీటర్లను ఇవ్వడమైనది. దీని ద్వారా ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్ల ద్వారా కోవిడ్ ఉన్న వ్యక్తుల యొక్క పల్స్ మరియు ఆక్సిజన్ లెవెల్స్ ను తెలుసుకోవడానికి వీలవుతుంది. గ్రామాలలో కోవిడ్ జాగృతి కార్యక్రమాలలో భాగంగా ఏపీ మాస్ ప్రాజెక్ట్ మేనేజర్ గోపాలరాజు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్ కుమార్ గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. ఒకరికి ఒకరు ఎడం పాటించాలి. తప్పనిసరిగా పరిశుభ్రంగా చేతులు, కాళ్ళు పరిశుభ్రంగా కడుక్కోవాలి. తప్పనిసరి అయితే శానిటైజర్ ఉపయోగించాలి. పని ఉంటే తప్ప బయటికి రాకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ నందు కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు ఉండటం వలన కరోనాను జయించ వచ్చని తెలియజేశారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking