Header Top logo

కేసీఆర్- మోదీ పాలనపై మావోయిస్టుల లేఖ

కేసీఆర్- మోదీ పాలనపై మావోయిస్టు నక్సల్స్ కన్నెర్ర

సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు నక్సల్స్ కార్యకలపాలు తగ్గు ముఖం పట్టాయి. కమ్యూనికెేషన్ వ్యవస్థ రావడంతో వారి కార్యకలపాలను అణచడంలో పోలీసులది పై చేయిగా మారింది.

అయితే.. పాలకుల పాలిసీపై అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మీడియాకు పంపుతున్నారు మావోయిస్టులు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కుల మత జాతి భేదాలతో రాష్ట్రాన్ని వల్ల కాడు చేస్తున్నారని ఆరోపిస్తూ మావోెయిస్టు నక్సల్స్ పంపిన లేఖ ఇదే.

—–    ——

భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) కొమ్రం బీం-మంచిర్యాల డివిజన్ కమిటి

తెలంగాణ రాష్ట్రాన్ని కుల మత జాతి భేదాలతో రాష్ట్రాన్ని వల్ల కాడు చెయ్యాల ని, కుట్రపూరితంగ కె.సి.ఆర్. ప్రభుత్వం, తెల్ల దొరల పాలనాను, మించి నల్ల దొరల పాలన కొనసాగిస్తున్నాడు.

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు, కులాల మధ్య కొండీలు పెట్టి, మతాల మధ్య మంటలు రేపి, జాతుల మధ్య చిచ్చులు పెట్టి.టి.ఆర్. యస్. పాలకులు చూస్తున్నారు. కుట్రపూరితంగానే 11 కోండు కులాలను యస్ టి తెగ లొ కలిపి ఆదివాసీయులకు ధగా చేస్తున్నాడు.

నోర మోరీ, అన్నట్లు అరాచకంగ మాట్లాడు తున్నాడు. కల్లుతాగిన కోతిలా ఎగురు తున్నాడు. కేంద్రంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు, రాష్ట్ర లో బి.ఆర్. యస్. (టి.ఆర్. యస్.) లు ఆవులావులు కొట్లాడి లేగల కాల్లు విరిచి నట్లు, లంబడా ఆదీవాసీల మద్య చిచ్చు రగుల్సు తున్నారు.

ప్రియ మైన ఆదివాసీ ఆదీవాసేతర ప్రజలారా? గతంలో లంబాడా ఆదీవాసీల మధ్య జరిగిన తగాదాలు ఎంత? నష్టాన్ని కలిగించిందో మన అందరికి తెలిసినదే,

అందుకని ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓట్లు అడగ వచ్చె, కుహాన దేశ భక్తి, జాతి ఉన్మాదం తో హిందుత్వ మతోన్మాదులు బి.జె, పి. గుండా రాజకీయ నాయకులు, టి.ఆర్. యస్. కుతంత్ర దొరల పాలకులు ఓట్లు అడగ వస్తె తన్ని తరమండి, జల్, జంగల్, జమీన్ ఆత్మగౌరవ అధికారంకై భూమి భుక్తి, విముక్తి కై సాయుద వ్యవసాయక విప్లవ బాటలో నడవండి నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంలో దున్నేవారికే భూమిదక్కెటంతవరకు విముక్తి పోరులో నడవండీ!

కార్పోరేట్ కంపనీలు పెంచాలంటున్న అను ఉత్పాదక రంగమైన పోలీసుల, తన్ని తరమండి, నీరు పరియవరణం. వ్యవసాయాన్ని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపనీలు కావాల?  తినడానికి తిండి, తాగడానికి నీరు, ప్రాణాని కి ప్రాణా వాయు వు, ప్రకృతి సంపద, భూమి అవసరం లేదట, ఈపోలీసులకు పెట్టుబడిదారులు కావాలట, ఈల కోరు కునే దోపిడీదళారీ కావాలి కుక్కల తన్ని తరమండి,

ప్రియ మైన పీడిత కార్మిక కర్షక మహిళ విద్యార్థి యువజన మేదావుల్లారా, పోసులు పెట్టుబడిదారులు మతోన్మాదులు, దొరలు పాలకులంతా ఒక్క టే, భూస్వామ్య వ్యవస్థ ను పెంచి పోషిస్తున్న బ్రాహ్మణీయ హిందుత్వ పారిశ్రామికీకరణ వెత్త లంతా ఒక్కటే, ఈకుల్లిన భూస్వామ్య వ్యవస్థ నిర్మూలించ, దోపిడీరాజ్యం పై సవారి చేద్దాం, రండి రారండీ ఐక్య కార్యాచరణ ప్రణాళిక తో ఉద్యమిద్దాం!

విప్లవాభి వందనాలతో

కొమ్రం బీం-మంచిర్యాల డివిజన్ కమిటి

 

Leave A Reply

Your email address will not be published.

Breaking