జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకి కృతజ్ఞతా భివందనలు తెలిపిన మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి
ఏపీ39టీవీ న్యూస్ మార్చి 23
గుడిబండ:- మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గంధం చంద్రుడుని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మర్యాద పూర్వకంగా కలిసి
ఇటీవలే జరిగిన పంచాయతీ, మున్సిపల్, నగరపంచాయతీ ఎన్నికలను గతంలో ఎన్నడూ లేనివిదంగా ప్రశాంతత వాతావరణంలో సజావుగా జరిగేలా తనవంతు బాధ్యతగా కృషిచేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సేవలు మరచిపోలేనివని ఎమ్మెల్యే కొనియాడారు.ఈ సందర్బంగా పుష్పగుచ్చలు అందించి కృతజ్ఞతాబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కుమారుడు డాక్టర్ దినేష్ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కరికెర జయరామప్ప తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ