Header Top logo

Macaulay, creator of the Indian Penal Code భారతీయ శిక్షాస్మృతి సృష్టికర్త  మెకాలే

Macaulay, creator of the Indian Penal Code

భారతీయ శిక్షాస్మృతి సృష్టికర్త  మెకాలే

అక్టోబర్ .. ఐ పిసి అమలు లోనికి వచ్చిన దినం
161 ఏళ్లుగా చెక్కు చెదరని మూల రూపం

భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్ ఐ పి సి) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారత దేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 – 1860 అక్టోబరు 6 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది. ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్లో కూడా అమలులో ఉంది. కానీ, ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని పిలుస్తారు.

ఇండియన్ పీనల్ కోడ్ మూలాలు 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలు లోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి 1860 లో, మొదటి లా కమిషన్ అజమాయిషిలో జరిగింది. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).

మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలు లోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచం లోను, భారతీయ సమాజాల లోను, విద్యాపరంగా, వైజ్ఞానికంగా, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీ లోను, ప్రయాణ వాహనాలలోను, న్యాయపరంగా, వైద్యరంగం లోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు (ఏ.టి.ఎమ్), సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు, చేర్పులకు గురి అవుతూ, నేటి రూపాన్ని పొందింది. గృహ హింస సెక్షన్ 498-ఎ ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతిలో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, ఐరోపా, అమెరికా దేశాలలో లేదు కాబట్టి, వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతిలో లేవు. లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంథాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ ‘చిత్తుప్రతి’ ని తయారు చేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసు కున్నాడు.

శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాల కంటే, నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తుతో ‘ఇండియన్ పీనల్ కోడ్’ చిత్తుప్రతి తయారు చేశాడు.https://zindhagi.com/wp-admin/media-upload.php?post_id=278&type=image&TB_iframe=1 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయ శాస్త్రంలో, దీనికి తిరుగు లేదు. పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ని యధా తధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి). బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ను యధాతధంగా (మక్కికి, మక్కి) అమలు చేస్తున్నాయి.

లార్డ్ మెకాలే తయారు చేసిన ‘చిత్తుప్రతి’ ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించాడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్ట వశాత్తు, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై, అమలు జరగటం చూడలేదు. కారణం మెకాలే 1859 డిసెంబరు 28 న, తన 59వ ఏట, మరణిం చాడు. ఆయన  అవివాహితుడు. ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ – కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830కి ముందు, భారతదేశంలో, ‘ది ఇంగ్లీష్ క్రిమినల్ లా’, అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.

ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచమే కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారి పోతున్నా కూడా, 160 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. ఆయన మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను అయ్యింది.

ఇండియన్ పీనల్ కోడ్ ( భారతీయ శిక్షాస్మృతి ), 1860 , నేరాల

పరంపరను సేకరించి , వాటికి పడే శిక్షలకు అనుగుణంగా నేరాల

విభజన ( వర్గీకరణ )ను చేసింది. నేర పరిశోధనను, ప్రాసిక్యూషన్

ను విభజించమని ( బ్రిటన్ లోని సి.పి.ఎస్.న్ వలె) దానివలన

నేరాలు , శిక్షలు తొందరగా పరిష్కారం అవుతాయని పేర్కొంది.

న్యాయ శాస్త్రం లోని పదాల అర్ధాల వివరణ,  శిక్షలు గురించిన వివరణ,

సాధారణమైన మినహాయింపులు,

స్వీయ రక్షణ హక్కు నుంచి, అబెట్మెంట్ , (నేరానికి సహకరించుట), నేరపూరితమైన కుట్ర , చట్టము అతిక్రమించు కుట్ర,

దేశానికి వ్యతిరేకంగా (దేశ ద్రోహం) చేసే నేరాలు, పదాతి దళం (ఆర్మీ), నౌకాదళం (నేవీ), వాయుసేనా దళం (ఏర్ ఫోర్స్), ఈ

మూడు దళాలకి సంబదించిన నేరాలు. (1917లో నేవీ (నౌకాదళం), ఏర్ ఫోర్స్ (వాయుసేనా దళం),  సైన్య వ్యతిరేక నేరములు, ప్రజల శాంతి , భద్రతలకు భంగం కలిగించే,

ప్రజా సేవకులైన ప్రభుత్వ

ఉద్యోగులకు సంబంధించిన నేరాలు, ప్రభుత్వ ఉద్యోగులు చేసే నేరాలు, ఎన్నికలు వాటికి సంబంధించిన నేరములు,

కోర్టు ధిక్కరణ నేరాలు (కంటెంప్ట్స్ ఆఫ్ లాఫుల్ అథారిటి ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్), తప్పుడు సాక్ష్యాలు, పబ్లిక్ జస్టిస్ కి వ్యతిరేకంగా చేసే నేరాలు, నాణెములు (ప్రభుత్వ ధనము), ప్రభుత్వము ముద్రించే స్టాంపులు, తూనికలు మరియు కొలతలు – సంబంధించిన నేరాలు, ప్రజల ఆరోగ్యము, భద్రత, సౌకర్యము, మర్యాద, నీతి కి సంబంధించిన నేరాలు, మతానికి సంబంధమైన నేరాలు, మానవ శరీరానికి హాని కలిగించే నేరాలు .

1.ప్రాణ హాని ( హత్య తో కలిసి), కల్పబుల్, హోమిసైడ్,

2.గర్భస్రావం కలిగించటం పుట్టబోయే (ఇంకా పుట్టని) బిడ్డలకు హాని చేయటం ( గాయ పరచటం), ఎక్స్పోజర్ ఆఫ్

ఇన్ఫేంట్స్ కన్సీల్మెంట్ ఆఫ్ బర్త్స్ (పిల్లల పుట్టుకను వెల్లడించ కుండా దాచటం)

3.గాయపరచటం

4.అనధికారకంగా అడ్డుకోవటం బందించటం (నిర్బంధించటం)

5. నేరపూరితంగా దాడి చేయటం, గాయపరచటం, 6.కిడ్నాపింగ్ (మనిషిని బలవంతంగా గాని, మోసపూరితంగా గాని ఎత్తుకు పోవటం), అబ్డక్షన్, బానిసత్వం , వెట్టి చాకిరి (బలవంతంగా, బలప్రయోగంతో పని చేయించు కోవటం), 7.లైంగిక వేధింపులు ( అత్యాచారం లేదా మానభంగం ( రేప్ ) తో సహా) – సంబంధించిన నేరాలు, 8.అసహజమైన నేరాలు (సెక్షన్ 377), ఆస్తులకు సంబందించిన నేరాలు 1.దొంగతనం, 2.ఎక్స్టార్షన్, 3.రోబరీ , దోపిడీలు, 4.ఆస్తులకు సంబందించిన విషయాలను తారు మారు చేయటం (క్రిమినల్ మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ),

5.నమ్మకం వమ్ము చేయటం (నమ్మించి మోసం చేయటం) (కిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 6.దొంగతనం చేసిన సొమ్ముని, వస్తువులను (దొంగసొత్తు ), కొనటం, స్వీకరించటం, 7.మోసం చేయటం, 8.తప్పుడు పనుల (తప్పుడు పత్రాల) ద్వారా ఆస్తులను అమ్మటం (ఫ్రాడ్యులెంట్డ్స్ డీడ్ అండ్ డిస్పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ), 9.అల్లర్లు, అల్లరి పనులు చేయటం, 10.హక్కు ( అనుమతి ) లేకుండా, ఇతరుల ఇళ్ళలోకి, భూములలోకి ప్రవేశించటం, ఆస్తి పత్రాలకు సంబంధించిన నేరాలు, ఆస్తుల (భూములు, ఇళ్ళు) హద్దులకు సంబంధించిన నేరాలు: 1.ఆస్తులు (భూములు, ఇhttps://zindhagi.com/wp-admin/media-upload.php?post_id=278&type=image&TB_iframe=1ళ్ళు), ఇతర హద్దులకు సంబంధించిన నేరాలు, 2. కరెన్సీ నోట్లు, బాంక్ నోట్లు – సంబంధించిన నేరాలు, 1958 లో చేర్చారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్, పెళ్ళి (వివాహం)కు సంబంధించిన నేరాలు. భర్త, భర్త తాలూకు బందువుల హింస (కౄరత్వం).  గృహ హింస చట్టాన్ని 1983 లో చేర్చారు.

రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ జర్నలిస్ట్ సెల్ :  9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking